Water Drinking : తాగే నీళ్లకు, గుండె ఆరోగ్యానికి సంబంధం ఉందా.. అధ్యయనం ఏం చెబుతోంది?
Water Drinking : నిత్యం ఎక్కువగా మంచి నీరు తాగాలని పెద్ద వాళ్లతో పాటు వైద్యులు చెప్తుంటారు. నిజానికి నీరు తాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చునంట. రోజులో 8 గ్లాసులకు తక్కువ కాకుండా...

నిత్యం ఎక్కువగా మంచి నీరు తాగాలని (Water Drinking) పెద్ద వాళ్లతో పాటు వైద్యులు చెప్తుంటారు. నిజానికి నీరు తాగడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చునంట. రోజులో 8 గ్లాసులకు తక్కువ కాకుండా నీరు తాగాలని సూచిస్తుంటారు. ఒక అధ్యయనం ప్రకారం యుక్త వయసులో నీరు సరైన మోతాదులో తీసుకోని వారిలో గుండె సంబంధ సమస్యలు వచ్చాయి. నీటికి, గుండె ఆరోగ్యానికి సంబంధాన్ని వీరి అధ్యయనంలో వివరించారు.
15,792 మందిపై 25 సంవత్సరాల పాటు వీరి అధ్యయనం కొనసాగించి.. నీరు తాగడానికి గుండె వైఫల్యం ప్రమాదం నుంచి బయటపడటానికి సంబంధమున్నదని తేల్చారు. ఈ అధ్యయనాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) శాస్త్రవేత్తలు చేపట్టారు. వీరిలో సీరం సోడియం స్థాయిలను పరీక్షించగా.. నీరు తక్కువగా తీసుకోవడం వల్లనే అనే విషయం వెల్లడైంది.
నిజానికి నిత్యం రెండు లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచించేవారు. అయితే, ఇటీవలి పలు అధ్యయనాలు ప్రజలు అంత మొత్తంలో నీరు తీసుకోవద్దని తేల్చాయి. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల గుండె వైఫల్యానికి దారితీసే మార్పులను నిరోధించవచ్చునని మా అధ్యయనం సూచిస్తుందని పరిశోధకురాలు నటాలియా డిమిత్రివా తెలిపారు. శరీరంలో సీరం సోడియం స్థాయిలు పెరుగడం, తగ్గడం అనేది గుండె వైఫల్యాని దారితీస్తాయి. అందువల్ల సీరం సోడియం స్థాయిలను మెయింటేన్ చేయడానికి తగినంత నీరు తాగాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి ఇవి తీసుకోండి..
- గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ముతక తృణధాన్యాలను, తక్కువ తీపి పండ్లను తింటూ ఉండాలి.
- నిత్యం 45 నిమిషాలకు తక్కువ కాకుండా వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. శరీరం బరువును తగ్గించుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
- ప్రతిరోజు 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
- సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్‌కు ఎంత దూరంగా ఉంటే అంతగా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని మరిచిపోవద్దు.
- సోషల్ మీడియాలో నీరు తాగడంపై వచ్చే రూమర్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడం మంచిది కాదని వైద్యులు సెలవిస్తున్నందున.. వీటిని వీలైనంత ఎక్కువ దూరంలో ఉంచాలి.
ఇవి కూడా చదవండి..
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. పెరుగనున్న పెన్షన్
తండ్రీకొడుకుల మోసం.. 157 కోట్లు ముంచారు..
త్వరలో భారత్‌కు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ
అమెరికాను అధిగమించిన భారత్.. దేనిలోనంటే..?
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
అత్తారీ వద్ద బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్‌కు 412 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

