Afghanistan IT Minister : నిన్నటి వరకు ఆ దేశానికి మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
Afghanistan IT Minister : నిన్నటివరకు ఒక దేశంలో మంత్రిగా ఉండి ప్రణాళికలు అమలయ్యేలా చూసిన ఓ వ్యక్తి.. కాలక్రమంలో బతుకుదెరువు కోసం మరో దేశంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా...

బెర్లిన్ : నిన్నటివరకు ఒక దేశంలో మంత్రిగా ఉండి ప్రణాళికలు అమలయ్యేలా చూసిన ఓ వ్యక్తి.. కాలక్రమంలో బతుకుదెరువు కోసం మరో దేశంలో పిజ్జా డెలివరీ బాయ్‌గా (Afghanistan IT Minister) పనిచేయాల్సి వస్తున్నది. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పిజ్జాలు డెలివరీ చేస్తున్న ఈయన మరెవరో కాదు.. ఆఫ్ఘనిస్తాన్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ షా సాదత్. జర్మన్ నగరమైన లీప్జిగ్లో సాదాసీదా జీవితం గడుపుతున్న ఈయన.. పిజ్జా కంపెనీ యూనిఫాం వేసుకుని సైకిల్‌పై పిజ్జాలు చేరవేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశం కాగానే ఆ దేశాధ్యక్షుడితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఇతర దేశాలకు వలస వెళ్లారు. అక్కడి ఐటీ శాఖ మంత్రి అయిన సయ్యద్ అహ్మద్ షా సాదత్ కూడా కుటుంబసమేతంగా జర్మనీకి వెళ్లారు. అక్కడ లీప్జిగ్ నగరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సాదత్.. కుటుంబపోషణ కోసం పిజ్జాలు అందించే ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా పిజ్జా కంపెనీ యూనిఫాం ధరించి సైకిల్‌పై పిజ్జాలు చేరవేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌ను విజయవంతంగా తీసుకువచ్చిన మంత్రిగా దేశవ్యాప్తంగా సాదత్ అభినందనలు అందుకున్నారు.
ఇలాఉండగా, గత ప్రభుత్వంతో పొసగని కారణంగా కొంతకాలం క్రితమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అల్‌జజీరా ట్విట్టర్ ద్వారా నివేదించింది. కొద్దిరోజుల పాటు అక్కడే ఉన్న సాదత్.. ఆఫ్ఘాన్‌ను తాలిబాన్ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి వారం ముందు జర్మనీకి వలసవెళ్లినట్లు పేర్కొన్నది. చేతిలో సరిపోయేంత డబ్బు లేకపోవడంతో పిజ్జాలు డెలివరీ చేసే పనిని ఎంచుకున్నానని, ఈ పని చేయడం వల్ల తానేమీ ఫీలవడం లేదని సాదత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అత్తారీ వద్ద బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
బర్రెపై స్నానం.. ఆ ఆనందమే వేరు: సెహ్వాగ్
గెలీలీయో టెలిస్కోప్‌కు 412 ఏండ్లు
జేమ్స్ బాండ్ మ్యూజిక్‌తో అలరించిన ముంబై పోలీసులు
మర్మాంగానికి సీల్.. యువకుడు మృతి
ఈ ఆహారాలు తీసుకోండి.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | నిన్న ఖజాన, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

