e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home News Food and Age : ఈ ఆహారాలు తీసుకోండి‌.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?

Food and Age : ఈ ఆహారాలు తీసుకోండి‌.. జీవితకాలం పెంచుకోండి.. అవి ఏవంటే..?

మనం తీసుకునే ఆహారాలు మన జీవితకాలాన్ని(Food and Age) పెంచడం లేదా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. మన ఆహారపుటలవాట్లే మనకు శ్రీరామరక్ష అని తెలిసినప్పటికీ.. ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో ఆకలి కాగానే ఏది దొరికితే అది లాగించేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు రాగానే వైద్యుల చుట్టూ తిరుగుతున్నాం. స్థోమత లేకున్నా వేలకు వేలు ఖర్చు చేస్తున్నాం. అలాకాకుండా, పాతకాలపు పద్ధతులను పాటించడం ద్వారా మన జీవితాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.

మనం తినే చాలా రకాల ఆహారాలు మన వయసును తగ్గించేవిగా ఉంటున్నాయి. హాట్‌డాగ్‌, కాల్చిన చికెన్‌ వింగ్స్‌, డబల్‌ ఛీజ్‌ బర్గర్లు, సాఫ్ట్‌ డ్రింకులు, పిజ్జాలు.. ఇలా ఎన్నో ఫాస్ట్‌ఫుడ్స్‌ మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. హాట్‌డాగ్‌ అనే ఫాస్ట్‌ఫుడ్‌ను తినడం వల్ల ఒక వ్యక్తి జీవితకాలం 36 నిమిషాలు తగ్గిపోనున్నది. అదే, ఉప్పు వేసిన వేరుశనగ పప్పులను తినడం వల్ల మన జీవితకాలాన్ని 26 నిమిషాలు పెంచుకోవచ్చు. మనం తినే ఆహారాలు మన జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మిచిగాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వీరు దాదాపు 5 వేలకు పైగా ఆహార పదార్థాలపై అధ్యయనం జరిపారు. అలాగే, మనం నిత్యం తయారుచేసే ఆహార పదార్థాల నుంచి పారవేసే వరకు అవి మన పర్యావరణంపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో అనేది కూడా వీరు అధ్యయనం చేశారు.

వీటితో ఆరోగ్య ముప్పు..

- Advertisement -

అమెరికన్లు తినేందుకు అమితంగా ఇష్టపడే 1 గ్రాము ప్రాసెస్డ్‌ మాంసం తినడం ద్వారా 0.45 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందంట. ఈ లెక్కన ఒక్క హాట్‌డాగ్‌లో దాదాపు 61 గ్రాముల ప్రాసెస్డ్‌ మాంసం ఉంటున్నందున.. 27 నిమిషాల జీవితకాలాన్ని కోల్పోతున్నారని లెక్కగట్టారు. అదే, సాఫ్ట్‌డ్రింక్‌ను తాగడం ద్వారా 12.4 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. డబల్‌ ఛీజ్‌ బర్గర్‌ తింటే 8.8 నిమిషాలు, పిజ్జాలు తినడం వల్ల 7.8 నిమిషాలు, నిప్పులపై కాల్చిన చికెన్‌ వింగ్స్‌ తింటే 3.3 నిమిషాల జీవితకాలాన్ని కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వీటిని తింటే ఆయుర్ధాయం పెంపుదల..

అయితే, మన జీవితకాలాన్ని పెంచే ఆహారాలు కూడా మనకు ఎక్కువగా లభిస్తున్నాయి. వాటిపై మనం దృష్టిపెట్టి ఆహారంలో భాగం చేసుకోవడంపైనే శ్రద్ద చూపకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నాం. మన జీవితకాలాన్ని పెంచే ఆహారాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీనట్‌ బటర్‌. దీనిని తినడం ద్వారా 33 నిమిషాల ఆయుర్ధాయం పెంచుకోవచ్చునంట. ఇక ఉప్పు వేసిన వేరుశనగ పప్పులను తింటే 26 నిమిషాలు, బేక్‌ చేసిన సాల్మన్‌ చేపలు తింటే 16 నిమిషాలు, రాజ్మాతో అన్నం తింటే 13 నిమిషాలు, అరటిపండ్లతో 13.5 నిమిషాలు, టమాటలతో 3.8 నిమిషాల జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. అలాగే, అవకాడోలు తినడం ద్వారా 3.8 నిమిషాలు, ఆపిల్‌ పాయి తింటే 26 నిమిషాల ఆయుర్ధాయం పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

మార్గాన్ని మార్చుకోండి..

మరికొన్ని రోజుల పాటు ఆరోగ్యంగా ఉండి ఆయుర్ధాయం పెరిగేలా చేసుకోవాలంటే పోషకాలుండే సమతుల భోజనం అందేలా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారాల నుంచి 10 శాతానికి మించకుండా క్యాలరీలు అందేలా చూడాలి. భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా ప్లేట్‌ను అమర్చుకోవాలి. నీరు ఎక్కువగా తాగుతూ.. ఆల్కహాల్‌, సిగరెట్‌ తాగడం మానుకోవాలి. ఇలా నిత్యం పాటించడం ద్వారా మన జీవితకాలాన్ని అదనంగా 48 నిమిషాల పాటు పెంచుకోవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి..

గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం

తాలిబాన్‌ ఎన్ని ఆయుధాలు ఎత్తుకెళ్లిందో తెలియదు : పెంటగాన్‌

కాబూల్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌

ఆఫీస్‌ బోర్డు తొలగించిన హురియత్‌ నేతలు.. ఎందుకంటే..?

‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్‌ తీరు

ఇండియాకు వచ్చిన ఈస్ట్‌ ఇండియా షిప్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana