Israel Bombs : గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
Israel Bombs : సోమవారం అర్థరాత్రి గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఆయుధాల తయారీ ప్రాంతాన్ని బాంబులతో పేల్చివేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. ఈ దాడుల వార్తను ఐడీఎఫ్...

టెల్ అవీవ్ : గాజాలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు (Israel Bombs) చేపట్టింది. సోమవారం అర్థరాత్రి గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఆయుధాల తయారీ ప్రాంతాన్ని బాంబులతో పేల్చివేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. ఈ దాడుల వార్తను ఐడీఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రకటించింది. తీర ప్రాంతంలో అగ్నిమాపక బెలూన్లను గాజాలోని హమాస్ ప్రయోగించినందుకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేపట్టినట్లు తన పోస్ట్‌లో ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలో తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా తాము ఇలాగే ప్రతిస్పందిస్తామని కూడా స్పష్టం చేసింది.
గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్‌లో ఉన్న హమాస్ ఆయుధ కర్మాగారం, జబాలియాలోని టెర్రర్ టన్నెల్ ప్రవేశద్వారం, షెజయ్య పరిసరాల్లో భూగర్భ రాకెట్ లాంచర్ వంటివి జియోనిస్ట్ సైన్యం లక్ష్యంగా చేసుకున్నాయి. 2007 లో హమాస్ అధికారం చేపట్టినప్పటి నుంచి గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా తీవ్రవాదులు సాధారణ వ్యూహంగా ఆర్సన్ బెలూన్లను ఉపయోగిస్తున్నారు. గత వారం ఇజ్రాయెల్ జెట్లను లక్ష్యంగా చేసుకుని హమాస్ తీవ్రవాదులు జరిపిన మెషిన్ గన్ కాల్పులు ఇళ్లను తాకాయి. స్డెరోట్ ప్రాంతంలో నష్టాలను కలిగించాయి.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, ప్రతీకార చర్యగా సైన్యం అదనపు సొరంగ ప్రవేశాన్ని తొలగించింది. మే నెలలో 11 రోజుల భయంకరమైన యుద్ధం అనంతరం శాంతి ఒప్పందం కుదిరింది. అయితే, ఇరుపక్షాలు భారీ కాల్పులను కొనసాగించాయి. తాజాగా శనివారం గాజా సరిహద్దు దగ్గర గుమిగూడిన పాలస్తీనా నిరసనకారులపై ఇజ్రాయెల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో పాలస్తీనా బాలుడు, ఇజ్రాయెల్ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
తాలిబాన్ ఎన్ని ఆయుధాలు ఎత్తుకెళ్లిందో తెలియదు : పెంటగాన్
కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్
ఆఫీస్ బోర్డు తొలగించిన హురియత్ నేతలు.. ఎందుకంటే..?
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

