Terrorists Rally : ‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
Terrorists Rally : మరోసారి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తీరు బయటపడింది. ఉగ్రవాదులకు ఎలాంటి మద్దతు ఇవ్వడంలేదని ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన పాకిస్తాన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్...

ఇస్లామాబాద్ : మరోసారి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తీరు బయటపడింది. ఉగ్రవాదులకు ఎలాంటి మద్దతు ఇవ్వడంలేదని ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన పాకిస్తాన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో (Terrorists Rally) తాలిబాన్‌కు మద్దతుగా జైష్, లష్కర్ ఉగ్రవాదులు ర్యాలీలు చేపట్టడంతో పాక్ తీరు తేటతెల్లమైంది. తాలిబాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టిన ఉగ్రవాదులు, గాలిలోకి బుల్లెట్లు కాల్చి తమ సంతోషాన్ని వెల్లగక్కారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం లేదన్న పాకిస్తాన్ అబద్ధం ఇలా మరోసారి బహిర్గతమైంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో తాలిబాన్‌కు మద్దతుగా జైష్-ఇ-మొహమ్మద్ (జేఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు ర్యాలీ చేపట్టారు. ఈ రెండు సంస్థల ఉగ్రవాదులు గాలిలోకి కాల్పులు జరిపి ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో పలువురు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ ర్యాలీలు అబ్బాస్పూర్, హజీరా, సెన్సా ప్రాంతాలలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ప్రాంతాలు నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉన్నాయి.
ఇక్కడ, కొంతమంది పాకిస్తానీ జర్నలిస్టులు తాలిబాన్ నాయకుడు ముల్లా బరదర్, ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ కలిసి ప్రార్థనలు చేస్తున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేదిగా తయారైంది.
ఇవి కూడా చదవండి..
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
జనరల్ బోగీల్లో ప్రయాణానికి రిజర్వేషన్ అవసరం లేదు!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

