Online Business : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
Online Business : నాణ్యత, తక్కువ ఖరీదులో వస్తువులను చేరవేస్తూ మంచి లాభాలు పొందవచ్చు. అయితే, ఇంటి నుంచి బయట కాలు పెట్టకుండా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ...

(Online Business) ప్రస్తుత కరోనా కాలంలో తక్కువ రిస్క్‌తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంటిపట్టునే ఉండి వ్యాపారాన్ని ఎంతో బాగా ప్రజల వద్దకు తీసుకెళ్లే టైమ్ ఉంటుంది. నాణ్యత, తక్కువ ఖరీదులో వస్తువులను చేరవేస్తూ మంచి లాభాలు పొందవచ్చు. అయితే, ఇంటి నుంచి బయట కాలు పెట్టకుండా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి ఇ-కామర్స్ సైట్లు కల్పిస్తున్నాయి.
కరోనా సమయంలో ఆన్లైన్ ఇ-కామర్స్ కంపెనీలు లాభదాయకంగా నడుస్తున్నాయి. అలాగే ఇ-కామర్స్ సైట్‌తో కనెక్ట్ అయి వ్యాపారం చేయడం మరింత సులభంగా మారింది. ఆన్లైన్ ఇ-కామర్స్ సైట్లతో చేరడం ద్వారా వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చునో..? వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో..? తెలుసుకోండి.
రిజిస్ట్రేషన్ ఇలా..
ముందుగా sale.amazon.in లో సెల్లర్ అకౌంట్‌ను సృష్టించాలి. దీని కోసం జీఎస్టీ, ప్యాన్, ఆధార్ వంటి డాక్యుమెంట్లు అవసరమవుతాయి. బ్యాంకు అకౌంట్ నంబర్ కూడా అందజేయాలి. అలాగే, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఉత్పత్తుల జాబితాను అప్లోడ్ ఇలా..
- సెల్లర్ అకౌంట్‌ను సృష్టించిన తర్వాత అమెజాన్ సైట్లో ఉత్పత్తుల జాబితాను అప్లోడ్ చేయాలి.
- ఇది పూర్తికాగానే, ఉత్పత్తులు అమెజాన్ సైట్లో అమ్మకానికి కనిపిస్తాయి.
- అమెజాన్‌లో ఒక ఉత్పత్తిని విక్రయిస్తే.. స్టోరేజ్, ప్యాకేజింగ్, డెలివరీ, రిటర్న్‌లను నిర్వహించే అవకాశం మీకు ఉంటుంది.
- ఎఫ్‌బీఏ లేదా ఈజీ షిప్లో ఉత్పత్తి డెలివరీ, రిటర్న్‌ను అమెజాన్ నిర్వహిస్తుంది.
- మీరు కోరుకున్నపక్షంలో మీరే స్వయంగా మీ ఉత్పత్తులను పంపిణీ చేసుకోవచ్చు.
పేమెంట్స్ ఎలా..?
వినియోగదారుడు మీ ఉత్పత్తిని కొనుగోలు చేయగానే మీ అకౌంట్లోకి 7 రోజుల్లోగా డబ్బు జమ చేస్తారు. అమెజాన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించినప్పుడు రిఫరల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కనీసం 2 శాతంగా ఉంటుంది. వస్తువులను బట్టి ఈ రిఫరల్ శాతంలో తేడాలు ఉంటాయి. ఉత్పత్తి ధర నుంచి 2 శాతం తీసుకున్న తర్వాత, మిగిలిన డబ్బు మీ ఖాతాకు బదిలీ అవుతుంది.
ఇదేవిధంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎం సంస్థల ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉత్పత్తులను ఆయా సంస్థల ద్వారా విక్రయించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రిజిస్ట్రేషన్‌కు seller.flipkart.com లో, పేటీఎం రిజిస్ట్రేషన్‌కు seller.paytm.com లో నమోదు చేసుకుని ఉత్పత్తులను విక్రయించుకునే వీలుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మన ఉత్పత్తి అమ్ముడు పోయిన 7-15 రోజుల మధ్య డబ్బు మన అకౌంట్లో జమ అవుతుంది. అదే పేటీఎం సంస్థలో 10-12 రోజుల సమయం పడుతుంది.
ఇవి కూడా చదవండి..
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
వాతావరణ ప్రభావంతో నష్టపోనున్న చిన్నారులు
నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే: వెంకయ్యనాయుడు
దేశంలోనే తొలి స్మోగ్ టవర్ ఏర్పాటు.. ఇది ఎందుకో తెలుసా..?
హాల్‌మార్క్ ఐడీకి వ్యతిరేకంగా బంగారు దుకాణాల మూసివేత
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
ల్యాబ్‌లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

