చంద్రమండలం నుంచి తొలిసారిగా 55 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భూమి ఫొటోలను (Earth Photo) తీశారు. అంతకు 9 రోజుల ముందు అమెరికాకు చెందిన అంతిరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడి కక్ష్యలో దిగింది. అమెరికా నాసా ప్రయోగించిన అపోలో మిషన్ చంద్రుడి పైనుంచి భూమి ఫొటోలను తీసి పంపించింది.
అమెరికా 1960 తొలినాళ్లో అపోలో మిషన్‌ను ప్రారంభించింది. మానవులను చంద్రునిపైకి తీసుకువెళ్లడమే ఈ మిషన్ ఉద్దేశం. అయితే, ఆ సమయంలో శాస్త్రవేత్తలకు చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వివరణాత్మక ఫొటోలు అందుబాటులో లేదు. అపోలో మిషన్ అంతరిక్ష నౌక ఎక్కడ ల్యాండింగ్ అవుతుందో తెలుసుకునేందుకు చంద్రుడి ఉపరితలం ఛాయాచిత్రాలు అవసరమయ్యాయి. 1966 ఆగష్టు 10 న ఆర్బిటర్-1 ను నాసా ప్రయోగించింది. ఈ అంతరిక్ష నౌకలో ప్రధాన ఇంజిన్‌తోపాటు 4 సోలార్ ప్లేట్లు, 68 కిలోల కొడాక్ ఇమేజింగ్ సిస్టమ్ అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై వివిధ కోణాల్లో ఫొటోలు తీయడమే దీని పని. ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష నౌక.
ఈ అంతరిక్ష నౌక విజయవంతంగా బయల్దేరి ఆగస్ట్ 14 న చంద్రుడి కక్ష్యలోకి చేరింది. అనంతరం ఫొటోలు తీయడం ప్రారంభించి.. చివరకు 23 ఆగస్ట్‌న భూమి ఫొటోలు తీసి పంపింది. చంద్రుడి కక్ష్య నుంచి తీసిన భూమి మొదటి ఫొటో ఇదే. 28 ఆగస్ట్ నాటికి అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలం యొక్క మొత్తం 205 ఫొటోలను పంపింది. తిరిగి ఈ నౌక 29 అక్టోబర్ న చంద్రుడి ఉపరితలాన్ని తాకడం ద్వారా నాశనమైంది.
2004 : లోక్‌సభలో ఉపాధి హామీ చట్టం ఆమోదం
1996 : రెండు పవిత్ర స్థలాల భూమిని ఆక్రమించిన అమెరికన్లకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటన సందేశాన్ని జారీ చేసిన ఒసామా బిన్ లాడెన్
1991 : ప్రపంచంలో తొలి పబ్లిక్ వెబ్సైట్ ప్రారంభం
1990 : సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న ఆర్మేనియా
1962 : టెల్‌స్టార్ శాటిలైట్ ద్వారా అమెరికా-యూరప్ మధ్య తొలిసారి లైవ్ టీవీ కార్యక్రమాల ప్రసారం
1933 : జైలు నుంచి విడుదలైన మహాత్మాగాంధీ
1872 : ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
1456 : బైబిల్ తొలి కాపీని ప్రింట్ చేసిన జర్మనీకి చెందిన జోహన్నెస్ గుటెన్బర్గ్
ల్యాబ్‌లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..