Massive Burger : 4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
Massive Burger : అమెరికాకు చెందిన ఒక వ్యక్తి 20,000 కేలరీల భారీ బర్గర్‌ను నాలుగు నిమిషాల్లోనే లాగించేసి బర్గర్ పట్ల తనకున్న ప్రేమను ఆ విధంగా తెలిపాడు. ఈ 20,000 కేలరీల బర్గర్ బరువు...

లాస్ వెగాస్ : స్పీడ్‌గా తింటుంటే మన ఇంట్లో తిడుతుంటారు. మెల్లగా తినమని మనల్ని పురమాయిస్తుంటారు. అయితే, విదేశాల్లో వేగంగా తినే క్రీడాంశం సంచలనం సృష్టిస్తున్నది. తక్కువ సమయంలో ముందుంచిన ఆహారాన్ని లాగించేయడమే ఈ క్రీడ ముఖ్యోద్దేశం. ఇలాంటి అంశాల్లో ప్రపంచ రికార్డులు సృష్టించే వ్యక్తులను కూడా మనం చూశాం. సోషల్ మీడియా విభిన్న స్పీడ్ ఈటింగ్ సవాళ్ల వీడియోలతో నిండిపోయింది. అలాంటి ఒక వీడియో (Massive Burger) ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాకు చెందిన ఒక వ్యక్తి 20,000 కేలరీల భారీ బర్గర్‌ను నాలుగు నిమిషాల్లోనే లాగించేసి బర్గర్ పట్ల తనకున్న ప్రేమను ఆ విధంగా తెలిపాడు. ఈ 20,000 కేలరీల బర్గర్ బరువు 2.94 కిలోలు. 40 బేకన్ ముక్కలు, 8.5 పట్టీలు, 16 చీజ్ ముక్కలు, మొత్తం ఉల్లిపాయ, టమోటాలు, మిరప, బన్స్‌తో తయారు చేశారు. మాట్ స్టోనీ అనే అమెరికన్ పోటీదారు ఇటీవల లాస్ వేగాస్లోని హాంబర్గర్ రెస్టారెంట్ – హార్ట్ ఎటాక్ గ్రిల్లో ఆక్టోపల్ బైపాస్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఛాలెంజ్‌లో భాగంగా మాట్ ఈ 20,000 కేలరీల భారీ బర్గర్‌ను రికార్డు సమయంలో 4:10 నిమిషాల్లో తినేశాడు. ఈ ఛాలెంజ్ వీడియోను యూట్యూబ్ ఛానెల్లో గత నెల 25 అప్లోడ్ చేయగా.. ఇప్పటి వరకు 14.6 మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉండి కొత్త రికార్డును సృష్టించింది. చివరి ప్రపంచ రికార్డు ప్రకారం.. మికి సుడో అనే వ్యక్తి 7:42 నిమిషాల్లో ఇంత భారీ బర్గర్ తిన్నాడు.
ఇవి కూడా చదవండి..
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్ నియామకం
లాక్‌డౌన్‌ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

