Health Bands : రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
Health Bands :
రాఖీ పండుగ అన్నాచెల్లెండ్ల అనుబంధానికి ప్రతీక. అన్నాతమ్ముండ్లు తనకు రక్షగా ఉండాలని కోరుకుంటూ అక్కాచెల్లెండ్లు రాఖీలు కట్టడం అనవాయితీ. రాఖీలు కట్టిన అక్కాచెల్లెండ్లకు మిఠాయిలు తినిపించి కొత్త బట్టలు పెడుతుంటారు. అయితే, ఈ రాఖీ పండుగకు కొత్త బట్టలు, మిఠాయిలకు బదులుగా.. అన్నాతమ్ముండ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వెరైటీగా ఆరోగ్యరాఖీలు కడదాం. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ఫిట్నెస్ హెల్త్ స్మార్ట్ బ్యాండ్స్ (Health Bands) లభ్యమవుతున్నాయి. వీటి సోదరులకు బహుమతిగా ఇవ్వడం చాలా మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

స్మార్ట్ బ్యాండ్స్‌ను ఉపయోగించుకుని రక్తపోటు నుంచి హృదయ స్పందన రేటు వరకు తెలుసుకోవడం ద్వారా సోదరుడి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయండి. మీరు రోజులో ఎంత దూరం నడిచారనేది కూడా చెప్తాయి. కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో ఆరోగ్యం గురించి ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఫిట్నెస్ బ్యాండ్లను సోదరులకు కట్టి వారి ఆరోగ్యం మరింత బాగా ఉండాలని కోరుకోండి. మన రాష్ట్రంలో ఆదివారం రక్షాబంధన్ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టే సోదరీమణులు కొన్ని హెల్త్ అండ్ ఫిట్నెస్ బ్యాండ్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఎం4 ఇంటెలిజెన్స్

ఎం4 ఇంటెలిజెన్స్ బ్యాండ్‌ను బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లు, టాబ్లెట్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్‌ను గుర్తిస్తుంది. మీరు ఎంత నడవాలి? ఎంత నిద్రపోతున్నారు? అనే విషయాలను కూడా తెలియజేస్తుంది. కాల్స్, ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ నోటిఫికేషన్లను కూడా దీనిపై చూడొచ్చు.
రిగర్ ఎం4

రిగర్ ఎం4 బ్యాండ్ రంగురంగుల ఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. స్పీడోమీటర్ ఫీచర్, రక్తపోటు పర్యవేక్షణ వ్యవస్థ పనితీరును తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. హృదయ స్పందన రేటు, ఎస్పీఓ2 ని తనిఖీ చేస్తుంది.
నాచ్ ఎం4 ప్లస్

ఈ స్పోర్ట్స్ వాచ్ షియోమి, ఒప్పో, వివో మొబైల్ ఫోన్లకు అనుకూలంగా ఉంటుంది. రక్తపోటు మానిటర్ కేలరీ కౌంటర్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. వాటర్‌ప్రూఫ్ / స్వెట్ ప్రూఫ్ స్మార్ట్ బ్రాస్లెట్- ఐపీ67 రేటింగ్ అందుబాటులో ఉన్నది. స్నానం చేసే సమయాల్లో చేతి నుంచి తీయడం చాలా మంచిది.
టోకాడిస్ స్మార్ట్ బ్యాండ్

టోకాడిస్ స్మార్ట్ బ్యాండ్ ఆర్మీ బ్లూ కలర్ ఆప్షన్లో లభిస్తున్నది. 1.1-అంగుళాల కలర్ డిస్ప్లే, యూఎస్బీ ఛార్జింగ్ ఆప్షన్ కలదు. యాప్ నోటిఫికేషన్లు, కాల్స్, హార్ట్ బీటింగ్ రేట్, ఎస్పీఓ2 పర్యవేక్షణ వ్యవస్థను కలిగి ఉండే ఈ బ్యాండ్.. 3 స్పోర్ట్ మోడ్లతో అందుబాటులో ఉన్నాయి.
స్పై ఐడీ115

ఇది బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ అవుతుంది. రక్తపోటు, హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్‌ను గుర్తించడంతోపాటు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌తో ఫోన్ ఎక్కడ ఉన్నదో కూడా తెలుసుకునే ఫీచర్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు
ఆఫ్ఘాన్‌లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్‌కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

