e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 17, 2021
Home News Monalisa Painting : 110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్‌ దొంగతనం

Monalisa Painting : 110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్‌ దొంగతనం

ఏదైనా పెయింటింగ్ విషయం చర్చకు వస్తే, ప్రతీ ఒక్కరి నాలుకపై వచ్చే మొదటి పేరు మోనాలిసా. అందమైన ముఖంతోపాటు చిరునవ్వు, ఆకృతి, రంగు.. మోనాలిసా పెయింటింగ్‌కు (Monalisa Painting) ప్రత్యేక ఆకర్శణను తీసుకొచ్చాయి. ఈ పెయింటింగ్ మరో కారణంగా కూడా ప్రసిద్ధి చెందింది. అదేంటంటే, 110 ఏండ్ల క్రితం 1911 లో సరిగ్గా ఇదే రోజున మోనాలిసా పెయింటింగ్.. లౌవ్రే మ్యూజియం నుంచి అపహరణకు గురైంది. పెయింటింగ్‌కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా అన్ని వార్తాపత్రికల్లో దొంగతనం వార్తలు ప్రచురితమవడంతో..
ఈ కేసు చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నది.

మోనాలిసా.. భూమిపై అత్యంత గుర్తించదగిన అందమైన ముఖం కావచ్చు. లెక్కలేనన్ని టీవీ కార్యక్రమాలు, సినిమాల్లో ఈ చిత్రరాజాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో పేరడీలు వచ్చాయి. ప్రతి భాష కళా పుస్తకాల్లో ఈ పెయింటింగ్‌ కొలువుదీరింది. ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ పెయింటింగ్‌ దొంగతనానికి గురైన విషయాన్ని మరుసటి రోజుకు మ్యూజియం నిర్వాహకులు గుర్తించారు. పెయింటింగ్‌ను ఎత్తుకెళ్లిన వాడు డబ్బు కోసం ఫోన్‌ చేస్తాడని పోలీసులు రెండు రోజుల వరకు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మోనాలిసా పెయింటింగ్‌ పోస్టర్‌ను ముద్రించి అంతటా పంచిపెట్టి దొంగను పట్టుకోవడానికి సహకరించాలని పోలీసులు ప్రజలను కోరారు. చివరకు సెప్టెంబర్‌ 7 న ఒక అనుమానితుడిని పోలీసులు పట్టుకుని ప్రశ్నించగా, పాబ్లో పికాసో అనే ఫేమస్‌ ఆర్టిస్ట్‌ దొంగిలించాడని తప్పుడు సమాచారం ఇచ్చాడు.

- Advertisement -

రెండేండ్ల పాటు దర్యాప్తు జరిపినా పోలీసులు దొంగ ఎవరో కనిపెట్టలేకపోయారు. చివరకు ఓ ఆర్ట్‌ డీలర్‌కు విన్సెంజో పెరుగ్గియా అనే వ్యక్తి నుంచి అందిన లేఖలో.. తన వద్ద ఉన్న మోనాలిసా పెయింటింగ్‌ను అమ్మకానికి పెడుతున్నట్లు తెలిపాడు. విషయం పోలీసులకు చేరడంతో ఆర్ట్‌ డీలర్‌తో సమావేశం జరుగుతుండగానే విన్సెంజో పెరుగ్గియాను అరెస్ట్‌ చేశారు. మ్యూజియంలో పెయింటింగ్‌లకు గ్లాస్‌ ఫ్రేములు తయారుచేస్తుండగా ఈ పెయింటింగ్‌ను దొంగిలించినట్లు పోలీసులకు విన్సెంజో పెరుగ్గియా తెలిపాడు. ఈ నేరారోపణపై అరెస్ట్‌ అయిన విన్సెంజోకు కోర్టు ఏడాది 15 రోజుల జైలు శిక్ష విధించింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

ఇవాళ ప్రపంచ వృద్ధుల దినోత్సవం

2006: భారతరత్న అవార్డు గ్రహీత షెహనాయ్ ప్లేయర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మరణం

2006: సద్దాం హుస్సేన్ మారణకాండపై విచారణ ప్రారంభం

1988 : సెంట్రల్‌ ఆఫ్రీకా దేశంలోని న్యోస్‌ అనే లేక్‌ పరిసర ప్రాంతాల్లో నివసించే 1700 మంది మృత్యువాత

1972: భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఆమోదం

1957: ప్రపంచంలోనే మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఆర్‌-7 ను పరీక్షించిన సోవియట్ యూనియన్

1915: మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీపై యుద్ధం ప్రకటించిన ఇటలీ

1790: తమిళనాడులోని దిండిగల్‌ను స్వాధీనం చేసుకున్న జనరల్ మెడోస్ నేతృత్వంలోని బ్రిటిష్ దళాలు

ఇవి కూడా చ‌ద‌వండి..

తోటగా మారిన క్రికెట్‌ స్టేడియం.. ఎక్కడంటే..?

మసకబారుతున్న జో బైడెన్‌ గ్రాఫ్‌.. ఎందుకో తెలుసా?

తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement