Joe Biden Popularity : మసకబారుతున్న జో బైడెన్ గ్రాఫ్.. ఎందుకో తెలుసా?
Joe Biden Popularity : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అనుసరించి తీరు పట్ల బైడెన్‌పై అమెరికన్లు కోపంతో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం తర్వాత ఆయనకు ...

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్ఠ (Joe Biden Popularity) మసకబారుతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అనుసరించి తీరు పట్ల బైడెన్‌పై అమెరికన్లు కోపంతో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం తర్వాత ఆయనకు ప్రజాదరణ బాగా తగ్గిపోయింది. కేవలం ఆరు రోజుల్లోనే ఏడు శాతం గ్రాఫ్ పడిపోవడం విశేషం.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ వశం చేసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుసరించిన విధానంపై అమెరికా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఉన్నఫలంగా సేనలను ఆఫ్ఘాన్ నుంచి వెనక్కిరప్పించి తాలిబాన్ రెచ్చిపోవడానికి కారణమయ్యారని బైడెన్‌పై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. బైడెన్ నిరంతరం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయంలో గందరగోళం మధ్య ప్రజలను తరలించే విధానంపై అమెరిన్లు ఆగ్రహంగా ఉన్నారు. ఆఫ్ఘాన్ సంక్షోభంతోపాటు దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడంలో వైఫల్యంపై కూడా అక్కడి జనాలు మండిపడుతున్నారు. ఆఫ్ఘాన్ సంక్షోభం అనంతరం తొలిసారిగా ఆయన గ్రాఫ్ ఘోరంగా 50 శాతానికి పడిపోయింది.
రాయిటర్స్-ఇప్సోస్ పోల్ ప్రకారం, ఆగష్టు 13 వ తేదీన జో బైడెన్‌కు ప్రజాదరణ 53 శాతంగా ఉండగా.. ఇది ఆగస్టు 18 నాటికి 46 శాతానికి పడిపోయింది. 6 రోజుల్లో 7 శాతం మంది అమెరికన్లు జో బైడెన్‌ను తమ అయిష్ట జాబితాలో చేర్చారు. అదేవిధంగా, రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వేలో బైడెన్ ప్రజాదరణ 49.2 శాతంగా ఉన్నది. అతడిని ఇష్టపడని వారు 47.2 శాతంగా ఉన్నారు. ఈ సర్వేలో కూడా అతడి ప్రజాదరణ 50 శాతం కంటే తక్కువగా ఉన్నది. జనవరిలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు అతడిని ఇష్టపడని వారు 34 శాతం మాత్రమే ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
భారీ బోనస్ ప్రకటించిన టాటా స్టీల్
ఢిల్లీ బస్సులపై సీబీఐ విచారణ షురూ!
ఇరాన్లో కరోనా సంక్షోభం.. బ్లాక్‌లో వ్యాక్సిన్లు
జమ్ములో ఎన్కౌంటర్, అమరుడైన జేసీఓ
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్‌తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

