Delhi Buses : ఢిల్లీ బస్సులపై సీబీఐ విచారణ షురూ!
Delhi Buses : దేశ రాజధాని నగరంలో బస్సుల కొనుగోలుపై సీబీఐ విచారణను ప్రారంభించింది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 1,000 లో ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది,,,

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో బస్సుల (Delhi Buses) కొనుగోలుపై సీబీఐ విచారణను ప్రారంభించింది. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 1,000 లో ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దాంతో విచారణను ప్రారంభించిన సీబీఐ.. బస్సుల కొనుగోలుకు సంబంధించిన విషయాలను ఆరాతీస్తున్నది.
ఢిల్లీలో 1,000 లో ఫ్లోర్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) రెండు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నది. ఈ బస్సుల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణకు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టెండర్ నిబంధనలను విస్మరించి బస్సులను సరఫరా చేసే కంపెనీలకు మెయింటెనన్స్ కోసం ప్రతి సంవత్సరం రూ.350 కోట్లు చెల్లించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందని బీజేపీ ఎమ్మెల్యే విజయేందర్ గుప్తా ఆరోపించారు. మెయింటెనన్స్ కోసం చెల్లింపులు మూడేండ్ల వారంటీ వ్యవధిలో చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ అవినీకి ఆస్కారం ఉండేలా ఈ ఒప్పందం చేసుకున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణకు సహకరించాలని ట్రాన్స్పోర్ట్ విభాగం విజిలెన్స్ డైరెక్టర్‌కు ఏసీబీ లేఖ రాసింది. అయితే, నెలలు గడిచినా వారి నుంచి ఎలాంటి సమాధానం అందలేదు. ఇప్పుడు ఈ అవినీతిపై విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్లో కరోనా సంక్షోభం.. బ్లాక్‌లో వ్యాక్సిన్లు
జమ్ములో ఎన్కౌంటర్, అమరుడైన జేసీఓ
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్‌తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

