మన సంస్కృతి, వారసత్వం గురించి యువత తెలుసుకోవాలి: వెంకయ్యనాయుడు
ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ సమేతంగా...

హంపి : ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా యువతలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆకాంక్షించారు.
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన హింపిలో విజయనగర సామ్రాజ్య గతవైభవపు ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. మౌనంగా ఉండే రాళ్ళను, చైతన్యంతో కూడిన శిల్పాలుగా మలచిన శిల్పుల కళాచాతుర్యానికి ఈ నగరం నిదర్శనమని, ఇక్కడి ప్రతి రాయి ఓ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు.
వ్యక్తిగతంగా శ్రీ కృష్ణదేవరాయలును తాను ఎంతో అభిమానిస్తుంటానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. రాయల కాలంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించి రైతుల కోసం చెరువులు తవ్వించిన విషయాన్ని గుర్తుచేశారు. సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా ప్రసిద్ధిగాంచిన రాయలు.. అష్టదిగ్గజ కవుల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. అద్భుతమైన సంస్కృతి వారసత్వాలకు పుట్టినిల్లు అయిన భారతదేశ చారిత్రక వైభవాన్ని తెలియజేసే ఇలాంటి ప్రదేశాల గురించి భావితరాలకు తెలియజేసేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రదేశాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. పర్యటనలో భాగంగా హంపిలోని విరూపాక్ష స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. దేశసౌభాగ్యం, ప్రపంచ శాంతి కోసం స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆఫ్ఘాన్‌లో క్రికెట్ భవితవ్యం ఏంటి..?
మంటలతో విన్యాసాలు.. కరాటే కోచ్ మృతి
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడగింపు
యోగిపై పోటీకి సిద్ధమైన ఐపీఎస్‌కు గృహనిర్బంధం
110 ఏండ్ల క్రితం మోనాలిసా పెయింటింగ్ దొంగతనం
తోటగా మారిన క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

