Second Hand Mobile : సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
Second Hand Mobile : అప్పుడప్పుడు సెకండ్స్ కూడా ట్రై చేయవచ్చు. సెకండ్స్ అమ్మే దుకాణాలు నగరాల్లో ఎన్నో ఉన్నాయి. కేవలం మొబైల్సే కాకుండా...

మొబైల్ కొనాలని అనుకోగానే ఆన్లైన్ బిజినెస్ వెబ్సైట్లలో వెతికేస్తుంటాం. అయితే, ప్రతీసారి కొత్త గాడ్జెట్స్ కొనాలనే రూలేమీ లేదు కాద. పెద్ద మొత్తంలో డబ్బులు పోసి కొత్తవి కొని నాలుగు రోజుల్లోనే పాతవైపోయి.. మన మనసు కొత్త వాటిపైకి లాగుతుంటుంది. అలా ఏడాదికోసారి మొబలై ఫోన్లు మార్చాలంటే ఇబ్బందే. అందుకని అప్పుడప్పుడు సెకండ్స్ కూడా ట్రై చేయవచ్చు. సెకండ్స్ అమ్మే దుకాణాలు నగరాల్లో ఎన్నో ఉన్నాయి. కేవలం మొబైల్సే కాకుండా అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ దుకాణాల్లో దొరుకుతున్నాయి. కొన్ని దుకాణాలు షిప్పింగ్‌లో గీతలు పడినవి, సొట్టలు పడినవి కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. కొత్త వస్తువుల కంటే కొంచెం తక్కువ ధరలో ఇవి దొరకుతున్నాయి. అయితే, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మంచి ఫోన్లను మన సొంతం చేసుకోవచ్చు.
దొంగిలించబడిందా..?

సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనడంలో అతి పెద్ద భయమేంటంటే.. మనం కొనే ఫోన్ దొంగతనానికి గురైనవి ఉండటం. పోలీసు కేసుల నుంచి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఫోన్ కొనుగోలు చేసిన అసలు బిల్లును అడగండి. అసలు బిల్లు హార్డ్ కాపీ లేదా సాఫ్ట్ కాపీలో ఒరిజనల్ కొనుగోలుదారు పేరుతో పాటు కొనుగోలు చేసిన తేదీని కూడా తనిఖీ చేసుకోవాలి.
ఐఎంఈఐ నంబర్ చెక్ చేసుకోవాలి..?

ప్రతి ఫోన్‌కు ఐఎంఈఐ నంబర్ ఉంటుంది. సెకండ్స్ కొనే ముందు మనం సెలక్ట్ చేసుకున్న ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను చూడాలి. ఫోన్ సెట్టింగ్‌లో ఇచ్చిన ఐఎంఈఐ నంబర్‌తో ఫోన్ బాక్స్, బిల్లులో ఇచ్చే నంబర్‌తో సరిపోల్చుకోవాలి. బ్యాటరీ తొలగించే ఫోన్లయితే, బ్యాటరీ వెనుక భాగంలో ముద్రించిన ఐఎంఈఐ నంబర్‌తో తనిఖీ చేసుకోవాలి. బ్యాటరీపై నంబర్ లేకపోతే బ్యాటరీ రీప్లేస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఫోన్లో స్టార్యాష్06యాష్‌ను నొక్కి ఫోన్ ఐంఎఈఐ నంబర్ తెలుసుకోవచ్చు.
నకిలీ ఫోన్లను కనిపెట్టండి..

సరైన మొత్తంలో డబ్బు చెల్లించడం ద్వారా నకిలీ వస్తువులను కొనడం మనకు నష్టాన్ని కలిగిస్తుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలని భావించినప్పుడు.. నకిలీ ఫోన్లను గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి. నకిలీ ఫోన్లో ఫోన్ సెట్టింగ్‌లలో మోడల్ నంబర్ ఇవ్వబడదు. ఫోన్ బ్యాటరీ లేదా బ్యాక్ ప్యానెల్లో ఇచ్చిన మోడల్ నంబర్ ఉండదు. అలాగే, కొనుగోలు చేస్తున్న మోడల్ నంబర్ సరైనదా అని చూడటానికి ఇంటర్నెట్లో ఫోన్ మోడల్ నంబర్లో వెతకాలి.
ఫిజికల్‌గా పరీక్ష చేయండి..

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మొదటగా ఫోన్ టచ్‌ని తనిఖీ చేయాలి. టచ్‌ని మెరుగ్గా పరీక్షించడానికి 1-2 నిమిషాల గేమ్ ఆడండి. దీంతో పాటు టచ్ సెన్సిటివిటీ కూడా ఒకేసారి పరీక్షించవచ్చు. ఫోన్లో బ్రేకేజ్ లేదా గీతలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రత్యేకించి ఫోన్ సైడ్ ప్యానెల్లు, ఫోన్ ఎడ్జ్‌లు చూసుకోవాలి. ఫోన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్‌ని కూడా తనిఖీ చేయాలి.
వారంటీ కార్డు ఉన్నదా..?

సెకండ్ హ్యాండ్ ఫోన్లు వారంటీ లేదా ఎక్స్టెండెడ్ వారెంటీతో లభిస్తున్నాయి. వారంటీ ఉన్నప్పుడు ఫోన్ దొంగిలించబడటం లేదా నకిలీ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అలాగే, ఫోన్ పనితీరు లేదా వారంటీలో ఉన్న ఇతర సమస్యల కారణంగా.. సులభంగా పరిష్కరించుకోవచ్చు. దీనికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
ఇవి కూడా చదవండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్ నియామకం
లాక్‌డౌన్‌ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
రక్షాబంధన్ రోజున ఆరోగ్య రక్ష.. ఇలా ట్రై చేయండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

