ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన అన్ని స్థూల, సూక్ష్మ పోషకాలుతో కూడిన ఆహారం నిత్యం తీసుకోవాలి. మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి చాలా తక్కువగా అందుతాయి. శరీరం బాగా పనిచేయాలంటే ఈ పోషకం చాలా అవసరం.
మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి మనకు వివిధ ఆహారా పదార్థాలను తినడం ద్వారా అందుతాయి. ఇవి గుండె నుంచి పునరుత్పత్తి వరకు దాదాపు అన్ని కీలక అవయవాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఇది మన శరీరంలో అనేక కణ నిర్మాణాలకు కలిగి వుంటున్నందున.. వీటని మిస్ కాకుండా చూసుకోవడం చాలా అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను చేపలు, గుమ్మడి విత్తనాలు, బాదాంపప్పు, కోడిగుడ్డు, వాల్నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో వంటి వాటిలో విరివిగా లభిస్తాయి.
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి. కంటి చూపును మెరుగుపర్చడంలో గ్రేట్‌గా పనిచేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అధిక బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ సమస్య రాకుండా చూస్తాయి. లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధిని తగ్గించడంలో సహాయపడుతుంది. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల ప్రభావాన్ని మెరుగుపరచడమే కాకుండా, చేప నూనె వంటి కొన్ని సప్లిమెంట్లు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
ఫిష్ ఆయిల్ వంటి కొన్ని ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాలు ట్రైగ్లిజరైడ్ లేదా శరీరంలో రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండెకు ట్రైగ్లిజరైడ్స్ చెడు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల గుండెను యవ్వనంగా ఉంచుకోవచ్చు.
మెదడును చురుకుగా ఉంచడానికి ఒమేగా 3 చాలా మంచిది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ స్థాయిలను తగ్గిస్తుంది. వివిధ రకాల మానసిక అరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
అలాగే, ఫిష్ ఆయిల్, ఇతర ఒమేగా 3 ఆహారాలు.. కండరాలు, స్టామినా, శక్తిని అందించడానికి, వ్యాయామ సమయాన్ని మరింత నెరవేర్చడానికి సహాయపడతాయి. వర్క్అవుట్ చేయడానికి గ్రేట్‌గా సహాయపడతాయి. గర్భం దాల్చిన వారు తమ బిడ్డ ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకోవడం సహజం. అలాంటి వారు తమ ఆహారంలో అన్ని రకాల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోడం ముఖ్యం.
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్ నియామకం
లాక్‌డౌన్‌ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..