Artificial Human Brain : ల్యాబ్‌లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
Artificial Human Brain : స్టెమ్ సెల్స్ నుంచి ల్యాబ్‌లో కృత్రిమంగా మానవుడి మెదడును జర్మన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. వీటిలో కళ్ళు కూడా అభివృద్ధి చేశారు. 60 రోజుల్లో ...

బెర్లిన్ : మానవ అవయవాలను ఒక్కొక్కటిగా తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు ఏకంగా మెదడునే అభివృద్ది చేశారు. స్టెమ్ సెల్స్ నుంచి ల్యాబ్‌లో కృత్రిమంగా మానవుడి మెదడును (Artificial Human Brain) జర్మన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. వీటిలో కళ్ళు కూడా అభివృద్ధి చేశారు. 60 రోజుల్లో దాదాపు 314 మినీ బ్రెయిన్లను తయారు చేసినా.. రక్త సరఫరా లేకపోవడం వల్ల చాలా వరకు మనుగడ సాధించలేకపోయాయి. ఈ మినీ మెదడులోని కళ్లు 5 వారాల పిండంలా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్‌లో దీని నుంచి అనేక కొత్త విషయాలు వెల్లడవడమే కాకుండా, అనేక వ్యాధుల చికిత్సలో ముందడుగు కానున్నదనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు. ఈ మినీ బ్రెయిన్‌ను జర్మనీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్ పరిశోధకులు తయారు చేశారు. ఈ పరిశోధన విషయాలను ‘సెల్ స్టెమ్’ జర్నల్‌లో ప్రచురించారు.

మినీ బ్రెయిన్ 3 మిమీ. వెడల్పుగా ఉన్నది. ఇందులో ఉండే కళ్లలో కార్నియా, లెన్స్, రెటీనా ఉన్నాయి. వీటి సహాయంతో మెదడు కాంతిని చూడగలుగుతుంది. ఈ కళ్ళు న్యూరాన్లు, నరాల కణాల సాయంతో మెదడుతో కూడా కమ్యూనికేట్ చేయగలవు. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ రెటీనా భవిష్యత్‌లో వస్తువులను చూడలేని వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన ప్రకారం, ఈ కళ్ళపై కాంతి కిరణాలు ప్రసరించినప్పుడు సంకేతాలు మెదడుకు చేరాయి. కళ్ళు చూసేవి మెదడుకు చేరుతున్నాయని ఇది రుజువు చేస్తుంది. ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడిన మెదడులో ఇది మొదటిసారి చూడబడింది.
కృత్రిమంగా తయారు చేసిన చిన్న మెదడు సాయంతో.. మానవ పిండం అభివృద్ధి సమయంలో, పుట్టుకతో వచ్చే రెటీనా రుగ్మతలలో రెటీనాపై కొన్ని రకాల ఔషధాలను పరీక్షించడం ద్వారా కన్ను, మెదడును ఎలా సంరక్షించుకోగలమో తెలుసుకోవడం సాధ్యమవుతున్నదని పరిశోధకుడు గోపాలకృష్ణన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
దేశ రక్షణలో తాలిబాన్ ‘బద్రి 313’.. ఎవరంటే..?
గాంధీకి బదులుగా జిన్నాను చంపి ఉంటే… : సామ్నాలో సంజయ్ రౌత్
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? అయితే, వీటిని పరిశీలించండి..
4 నిమిషాల్లో 20,000 కేలరీల బర్గర్ హంఫట్..!
ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్ : సయ్యద్ జైనుల్ అబెదిన్
మణిపూర్ గవర్నర్‌గా లా గణేశన్ నియామకం
లాక్‌డౌన్‌ను నిరసిస్తూ ఆస్ట్రేలియాలో ఆందోళనలు
157 ఏండ్ల క్రితం రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

