Climate Change : పిల్లలు జాగ్రత్త.. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు..
Climate Change : వాతావరణంలో మార్పుల ప్రభావం కారణంగా మన దేశంలోని పిల్లలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. మరో మూడు దక్షిణాసియా దేశాల చిన్నారులు కూడా ఈ సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాలను యూనిసెఫ్ ...

న్యూఢిల్లీ : (Climate Change) వాతావరణంలో మార్పుల ప్రభావం కారణంగా మన దేశంలోని పిల్లలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. మరో మూడు దక్షిణాసియా దేశాల చిన్నారులు కూడా ఈ సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాలను యూనిసెఫ్ తన కొత్త నివేదికలో వెల్లడించింది. ‘వాతావరణ సంక్షోభం అనేది బాలల హక్కుల సంక్షోభం : చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్‌ని పరిచయం చేయడం’ (సీసీఆర్‌ఐ) అనే దానితో యూనిసెఫ్ మొదటిసారిగా పిల్లలపై దృష్టి పెట్టింది. వాతావరణానికి పిల్లలు బహిర్గతం కావడం, తుఫానులు, వేడి తరంగాల వంటి పర్యావరణ ప్రభావాల ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తున్నారు. ఇలాంటి ర్యాక్ పొందిన దేశాల్లో భారతదేశంతోపాటు
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ దేశాల్లోని చిన్నారులు వాతావరణ సంక్షోభం ప్రభావాల కారణంగా అత్యంత ఎక్కువ ప్రమాదం కలిగి ఉన్నారు. నాలుగు దక్షిణాసియా దేశాలతోపాటు హైరిస్క్‌గా వర్గీకరించిన 33 దేశాల్లో దాదాపు 1 బిలియన్ మంది పిల్లలు నివసిస్తున్నారు. గ్లోబల్ టెంపరేచర్ 2 డిగ్రీలు పెరిగితే రానున్న రోజుల్లో దాదాపు 60 కోట్ల మంది తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కోనున్నారని, ఇదే సమయంలో ఆకస్మిక వరదలు ముంచెత్తి సమస్యలు సృష్టిస్తాయని యూనిసెప్ తన నివేదికలో తెలిపింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కాలుష్య 30 నగరాల్లో 21 భారతదేశంలోనే ఉన్నాయని పేర్కొన్నది.
పర్యావరణాన్ని కాపాడటంలో ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో చిన్నారుల ఆరోగ్యంపై పెను ప్రమాదం చూపుతుందని యూనిసెఫ్ భారత ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్ చెప్పారు. భారతదేశం పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్‌లో చిన్నారులపై తక్కువ ప్రమాదం ఉన్నదని తెలిపారు. దక్షిణాసియాలోని లక్షల మంది చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి మా వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని యూనిసెఫ్ దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్ జార్జ్ లారియా అడ్జీ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావానికి తోడు కరోనా వైరస్ కూడా రావడంతో దక్షిణాసియా చిన్నారుల్లో ప్రభావం మరింత ఎక్కువైందని అడ్జీ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే: వెంకయ్యనాయుడు
దేశంలోనే తొలి స్మోగ్ టవర్ ఏర్పాటు.. ఇది ఎందుకో తెలుసా..?
హాల్‌మార్క్ ఐడీకి వ్యతిరేకంగా బంగారు దుకాణాల మూసివేత
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
ల్యాబ్‌లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

