Jeera and Weight Loss : శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
Jeera and Weight Loss : జీరా నీరు శరీరం బరువు తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. ఒక టీస్పూన్ జీరాను ...

(Jeera and Weight Loss) లావుగా ఉండటం ఆరోగ్యానికి సంకేతం కాదు. ఎక్కువ బరువుతో ఉండే వారు అనేక వ్యాధులకు గురవుతుంటారని జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నది. ఒబేసిటీ కారణంగా ఏటా 3 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ వెల్లడించింది. అధిక బరువుతో బాధపడుతున్న వారు భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. తప్పకుండా బరువు తగ్గించుకోవాల్సిందే. శారీరక వ్యాయామంతో పాటు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా శరీరం బరువును అదుపులో పెట్టుకోవచ్చు.
వంటింట్లో మనకు అందుబాటులో ఔషధ గుణాలున్న సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది జీలకర్ర గురించి. జీరా నీరు శరీరం బరువు తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. ఒక టీస్పూన్ జీరాను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ప్రతి రోజూ ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరం బరువు తగ్గించుకోవచ్చు. బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. జీలకర్రలో ఉండే థైమోల్ అనే రసాయనం, పైత్యరసం స్రవించేలా చేస్తుంది. ఈ పైత్యరసం శరీరంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వుల జీర్ణక్రియను నియంత్రిస్తుంది. అలాగే, జీరాలో లభించే ఆల్డిహైడ్ అనే మరో రసాయనం, శరీరంలో జీర్ణ ఎంజైమ్‌లను పెంచుతుంది.
మెరుగైన మెటబాలిజం, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. మలబద్ధకానికి కూడా ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో విషపదార్థాలను తొలగించడంలో గ్రేట్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజులో 3-4 సార్లు జీరా నీటిని తాగాలి. భోజనానికి ముందు, రాత్రి భోజనం తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
తక్కువ క్యాలరీల పానీయం
శరీరంలో క్యాలరీల కంటెంట్‌ను తగ్గించడం అనేది బరువు తగ్గడానికి ముఖ్య నియమాలలో ఒకటి. ఒక గ్లాసు జీరా వాటర్‌లో ఏడు క్యాలరీలు మాత్రమే ఉంటుంది. జీరా నీరు తాగేవారిలో క్యాలరీలు తగ్గిపోయి శరీరం బరువు కూడా తగ్గిపోతుంది.
బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది
బరువు తగ్గేటప్పుడు జీవక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. నెమ్మదిగా జరిగే జీవక్రియ అదనపు కొవ్వు తొలగించకుండా నిరోధిస్తుంది. జీరా నీరు జీవక్రియను మెరుగుపర్చడమే కాకుండా శరీరం బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
ఆకలిని అణిచివేస్తుంది
ఆహారం తీసుకోవాలన్న కోరికలు తగ్గించుకోవడం వల్ల శరీరం బరువు తగ్గించుకోవచ్చు. జీరా నీరు తక్కువ క్యాలరీల పానీయం అయినప్పటికీ, ఎక్కువ కాలం ఆకలి కాకుండా చేస్తుంది. ఆకలి బాధలను అణిచివేస్తుంది. ఫలితంగా అధిక క్యాలరీలు తీసుకోవడం నియంత్రణలో ఉంటుంది.
జీర్ణక్రియకు తోడ్పడుతుంది
సక్రమంగా జరుగని జీర్ణక్రియ, మలబద్ధకం వంటివి బరువు తగ్గించే ప్రక్రియను అడ్డుకుంటాయి. జీరా నీరు ప్యాంక్రియాస్‌ను శరీరంలో పిత్తాన్ని విడుదల చేయడానికి బలవంతం చేసి.. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలిక బరువు తగ్గడానికి ప్రాథమిక సూచనగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
వాతావరణ ప్రభావంతో నష్టపోనున్న చిన్నారులు
నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే: వెంకయ్యనాయుడు
దేశంలోనే తొలి స్మోగ్ టవర్ ఏర్పాటు.. ఇది ఎందుకో తెలుసా..?
హాల్‌మార్క్ ఐడీకి వ్యతిరేకంగా బంగారు దుకాణాల మూసివేత
చంద్రమండలం నుంచి ఫొటో దిగిన భూమి
ల్యాబ్‌లో కృత్రిమ మానవ మెదడు సృష్టి
నిత్యం ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ తీసుకోవాల్సిందే..! ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

