Ukrainian plane : కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్
Ukrainian plane : కాబూల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన విమానం హైజాక్‌కు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు...

కీవ్ : కాబూల్‌లో ఉక్రెయిన్‌కు చెందిన విమానం (Ukrainian plane) హైజాక్‌కు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఈ విమానాన్ని హైజాక్ చేసినట్లు సమాచారం. తమ దేశానికి చెందిన విమానం హైజాక్ అయినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. హైజాక్ చేసిన విమానాన్ని దుండగులు ఇరాన్‌కు తరలించినట్లుగా తమ వద్ద సమాచారం ఉన్నదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి యెవ్జెనీ యెనిన్ మీడియాకు తెలిపారు. ఉక్రేనియన్ విమానాన్ని గుర్తుతెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ తీసుకెళ్లినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ నివేదించింది.
ఆఫ్ఘనిస్తాన్లోని ఉక్రేనియన్లను తరలించేందుకు వచ్చిన ఉక్రేనియన్ విమానం హైజాక్‌కు గురైంది. కొద్ది మంది సాయుధులు విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నదని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ మంగళవారం చెప్పారు.
‘ఆదివారం మా విమానం కాబూల్‌లో హైజాక్‌కు గురైంది. మా నుంచి గుర్తుతెలియని దుండగులు విమానాన్ని దొంగిలించారు. ఉక్రేనియన్లను ఎయిర్‌లిఫ్టింగ్ చేయడానికి పంపిన ఈ విమానాన్ని.. తమ వారితో నింపుకుని ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉక్రేనియన్లను తరలించేందుకు మరో విమానాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని యెవ్జెనీ యెనిన్ తెలిపారు.
ఇలాఉండగా, ఆదివారం 31 మంది ఉక్రేనియన్లతో పాటు 83 మందితో కూడిన సైనిక రవాణా విమానం ఆఫ్ఘనిస్తాన్ నుంచి కీవ్‌కు చేరుకున్నది. 12 మంది ఉక్రేనియన్ మిలిటరీ సిబ్బంది స్వదేశానికి తిరిగి వచ్చారని, సహాయం కోరివచ్చిన విదేశీ జర్నలిస్టులు, వ్యక్తులను కూడా తరలించినట్లు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. దాదాపు 100 మంది ఉక్రేనియన్లు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఉండిపోయారు.
ఇవి కూడా చదవండి..
ఆఫీస్ బోర్డు తొలగించిన హురియత్ నేతలు.. ఎందుకంటే..?
‘పీఓకే’లో టెర్రరిస్టుల ర్యాలీ.. మరోసారి బయటపడిన పాకిస్తాన్ తీరు
ఇండియాకు వచ్చిన ఈస్ట్ ఇండియా షిప్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా వ్యాపారం చేయండి.. ఎలాగంటే..?
శరీరం బరువు తగ్గించుకోవాలా..? ఇలా ట్రై చేయండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

