పోలీసు వలయంలో సిద్దిపేట!
సిద్దిపేటలో గురువారం సీఎం సభ నేపథ్యంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సుమారు పది జిల్లాల నుంచి మూడు వేల మందికి పైగా పోలీసు బలగాలను రప్పించారు.
- నేటి సీఎం సభకు భారీ బందోబస్తు
- పొరుగు జిల్లాల నుంచి జనాలు
- స్థానికులు నిలదీస్తారనే భయం
- బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
- గులాబీ నేతలపై నిఘా.. ముందస్తు అరెస్టుకు చర్యలు
సిద్దిపేట, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేటలో గురువారం సీఎం సభ నేపథ్యంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సుమారు పది జిల్లాల నుంచి మూడు వేల మందికి పైగా పోలీసు బలగాలను రప్పించారు. ఐదుగురు ఎస్పీలు, అడిషనల్ ఎస్సీలు 8, డిఎస్పీలు 35, సీఐలు 120, ఎస్సైలు 250 మందితోపాటు ఇతర పోలీసు బలగాలను మోహరించారు. సభా ప్రాంగణంలో 200 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి కదలికను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు.
మరోవైపు సీఎం సభకు జన సమీకరణ కాంగ్రెస్ నాయకులకు సవాలుగా మారింది. సిద్దిపేటతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఇతర నియోజకవర్గాలు, పక్క జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. గ్రామానికి రెండు చొప్పున ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించారు. సుమారు 50 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు వరుసల్లో స్థానికులు కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినవారు కూర్చుండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు వరుసలో సిద్దిపేట ప్రజలు ఉంటే ఎక్కడ సీఎంను నిలదీస్తారేమోనని ఇలా జాగ్రత్త పడుతున్నారు.
సీఎం సభ నేపథ్యంలో సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఫ్లెక్సీ కూడా కనిపించకూడదన్న సీఎంవో ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని ఫ్లెక్సీలను తొలగించారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కొందరిని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. సీఎం సభకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహణపైనా చివరి వరకు ఉతంఠ కొనసాగింది. ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ర్యాలీ మార్గంలో మార్పులు చేశారు. డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగి ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకునేలా రూట్ సిద్ధం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

