ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఆర్థిక స్థోమతలేని కక్షిదారుల తరపున ఉచితంగా కేసులను వాదించాల్సిన ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హత్య కేసులో నిందితుడి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
- రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు .. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘటన
పెద్దపల్లి కమాన్, నవంబర్ 18: ఆర్థిక స్థోమతలేని కక్షిదారుల తరపున ఉచితంగా కేసులను వాదించాల్సిన ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హత్య కేసులో నిందితుడి వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బుధవారం పెద్దపల్లి పట్టణంలో జరిగిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన డొంకెన రవీందర్ పెద్దపల్లి జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందగా, దీంతో నలుగురు వ్యక్తులపై కేసు నమోదైంది. బాధిత కుటుంబం తరపున కేసు వాదిస్తున్న పీపీ రవీందర్ తన వక్రబుద్ధి చూపాడు. ఈ కేసులో అనుకూలంగా వ్యవహరిస్తానని, దీనికి రూ.2లక్షలు ఇవ్వాలని నిందితులను డిమాండ్ చేశాడు. ఈ మేరకు సదరు నిందితుడు పీపీ రవీందర్ వ్యక్తిగత సహాయకుడు రెడ్డిరాజుల రాజయ్యకు పెద్దపల్లి పట్టణంలో రూ. 1.50 లక్షల లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రవీందర్‌తో పాటు వ్యక్తిగత సహాయకుడు రాజయ్యను అదుపులోకి తీసుకుని, నగదు స్వాధీనం చేసుకుని కరీంనగర్ ఏసీపీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లంచగొండి అవతారమెత్తి నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

