ఎన్విడియాపై సైబర్ దాడి!
ఎన్నిడియా సంస్థపై సైబర్ దాడి జరిగింది. ఎన్విడియా నుంచి చోరీచేసిన సమాచారాన్ని 234 గంటల్లో విడుదల చేస్తామని సైబర్ క్రైమ్ గ్రూప్ ‘ది జెంటిల్మెన్' ర్యాన్సమ్వేర్ ముఠా బెదిరించింది.
- డాటా చోరీ చేశామంటూ ర్యాన్సమ్వేర్ ముఠా బెదిరింపు
- 10 రోజుల్లో డాటా లీక్ చేస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ, నవంబర్ 18 : ఎన్నిడియా సంస్థపై సైబర్ దాడి జరిగింది. ఎన్విడియా నుంచి చోరీచేసిన సమాచారాన్ని 234 గంటల్లో విడుదల చేస్తామని సైబర్ క్రైమ్ గ్రూప్ ‘ది జెంటిల్మెన్’ ర్యాన్సమ్వేర్ ముఠా బెదిరించింది. డార్క్‌వెబ్‌లోని తన డాటా లీక్ వెబ్సైట్లో ఎన్విడియా పేరును చేర్చి, దాని పక్కనే కౌం ట్డౌన్ టైమర్‌ను ఉంచింది. ప్రస్తుతం ఆ టైమర్‌లో 234 గంటలు కనిపిస్తున్నా యి. ఇది 10 రోజుల కంటే తక్కువ సమయం. ఎన్విడియాపై ఒత్తిడి పెంచి, చర్చలకు రప్పించేందుకే ముఠా ఈ జాబితాను ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తున్నది. అయితే, తమ వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలనూ ముఠా బయటపెట్టలేదు. ఎన్విడియాపై నిజంగా సైబర్‌దాడి జరిగిందా అన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఈ ఘటనపై ముఠా జాబితాలో చాలా తక్కువ వివరాలే ఉన్నాయి.
ఎన్విడియా వ్యవస్థల్లోకి ఎప్పుడు చొరబడిందో, ఎలాంటి సమాచారాన్ని తీసుకున్నామని చెబుతున్నదో, సంస్థలోని ఏ విభాగం ప్రభావితమై ఉండవచ్చో హ్యాకర్లు వెల్లడించలేదు. తమ వాదనలను నిర్ధారించేందుకు ఉపయోగపడే చోరీచేసిన సమాచార నమూనాలనూ ఇవ్వలేదు. చర్చల కోసం ఉపయోగించగల ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సంప్రదింపు వివరమైన టాక్స్ ఐడీని ముఠా పోస్టులో చేర్చింది. టైమర్ ముగిసిన తర్వాత చెప్పిన సమాచారాన్ని విడుదల చేస్తామన్న సంకేతం కౌంట్‌డౌన్‌లో ఉన్నది. అయితే, ముఠా వద్ద నిజంగానే ఎన్విడియా సమాచారం ఉన్నదా, లేక సంస్థ పేరుతో ఒత్తిడి సృష్టిస్తున్నదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. జెంటిల్మెన్ ముఠా 2025 జూలై ప్రాంతంలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. సైబర్‌నేరగాళ్లు దాడులకు ఉపయోగించే పరికరాలను అనుబంధ ముఠాలకు అందిస్తారు. వసూలు చేసే పరిహార సొమ్ములో 90 శాతం తమ వద్దే ఉంచుకునేందుకు అనుబంధ ముఠాలకు అనుమతి ఉన్నట్టు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

