పాపాయి కోసం.. పాపాయిలాగే!
పసిపిల్లల చర్మం కోమలంగా ఉంటుంది. సున్నిపిండితోపాటు సబ్బులు వాడినా.. అవి కూడా సున్నితమైనవే ఎన్నుకుంటాం. అందుకే బేబీ సోప్స్ మార్కెట్లో ప్రత్యేకంగా దొరకుతాయి. అందులోని పదార్థాలు కూడా తక్కువ గాఢత ఉన్నవే వాడతారు. అయితే తమ సబ్బులు పాపాయిలాగే కోమలమైనవి అని చూపేలా... అచ్చం పసిబిడ్డను పోలిన బొమ్మల రూపంలో వాటిని తయారు చేస్తున్నారు.
పసిపిల్లల చర్మం కోమలంగా ఉంటుంది. సున్నిపిండితోపాటు సబ్బులు వాడినా.. అవి కూడా సున్నితమైనవే ఎన్నుకుంటాం. అందుకే బేబీ సోప్స్ మార్కెట్లో ప్రత్యేకంగా దొరకుతాయి. అందులోని పదార్థాలు కూడా తక్కువ గాఢత ఉన్నవే వాడతారు. అయితే తమ సబ్బులు పాపాయిలాగే కోమలమైనవి అని చూపేలా… అచ్చం పసిబిడ్డను పోలిన బొమ్మల రూపంలో వాటిని తయారు చేస్తున్నారు. మెత్తటి వస్త్రంలో పాపాయిని చుట్టినట్టుగా కనిపిస్తాయివి. గులాబీ, పసుపు, నీలం… ఇలా రకరకాల రంగుల్లో విభిన్నమైన సువాసనలు వెదజల్లేలా వీటిని రూపొందిస్తున్నారు. ముద్దులొలికే పాపాయి పాదాలను పోలి కూడా ఈ తరహా సబ్బులు వస్తున్నాయి. బొమ్మల్లా కనిపించే ఈ సబ్బులు పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకునేలా ఉంటున్నాయి. చూస్తే… మీకు కూడా వీటితో స్నానం చేయాలనిపిస్తోంది కదూ!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

