Google Pay : త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
Google Pay : త్వరలో ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్లను (ఎఫ్డీ) బుకింగ్ చేసుకునే వీలును గూగుల్ పే కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి...

న్యూఢిల్లీ : త్వరలో ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్లను (ఎఫ్డీ) బుకింగ్ చేసుకునే వీలును గూగుల్ పే (Google Pay) కల్పించనున్నది. భాగస్వామి ఫిన్‌టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. మింట్ నివేదిక ప్రకారం, గూగుల్ పే ద్వారా ఎఫ్డీలను బుక్ చేసుకునేందుకు తమ వినియోగదారులను అనుమతించడానికి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లను (ఏపీఐ) అందించడంలో ప్రత్యేకత కలిగిన ఫిన్‌టెక్ సేతుతో గూగుల్ జతకట్టింది.
దీంతో గూగుల్ పే వినియోగదారులు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలను ఒక ఏడాది వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ఎఫ్డీలకు పొందే గరిష్ట వడ్డీ రేటు 6.35 శాతంగా ఉండనున్నది. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ద్వారా ఆధార్ ఆధారిత కేవైసీని పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఏపీఐ బీటా వెర్షన్ 7-29 రోజులు, 30-45 రోజులు, 46-90 రోజులు, 91-180 రోజులు, 181-364 రోజులు, 365 రోజులు సహా వివిధ కాలపరిమితుల ఎఫ్డీలను అందిస్తున్నది. వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచి ఏడాది కాలం ఎఫ్డీకి అతి తక్కువగా 6.35 శాతం వడ్డీ రేటును ఇవ్వనున్నది. గూగుల్ పే భారతదేశంలో 1.50 కోట్ల నెలవారీ ఆక్టీవ్ యూజర్స్ కలిగి ఉన్నది.
అధిక వడ్డీ పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లను అందించడానికి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిన్‌టెక్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇటీవల, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నియో, ఫ్రియో వంటి ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యమై సేవింగ్స్ ఖాతాల్లో రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్‌లకు 7 శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం.. 30 నుంచి లోక్‌సభ, 2 నుంచి రాజ్యసభ సమావేశాలు
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
Vivek Venkataswamy | పెద్దపల్లి వివాదంతో నాకేం సంబంధం.. కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్‌తో వివేక్
Bridal Weight Loss | పెండ్లి చూపుల్లో బొద్దుగా.. పెండ్లి నాటికి స్లిమ్‌గా! అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారా?
Kaleshwaram | కాళేశ్వరా.. నీ గుడి పూర్తయ్యేదెన్నడు?.. పురాతన ఆలయం కూల్చివేసి 4 నెలలవుతున్నా ముందుకు సాగని పనులు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

