Alexei Navalny : జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
Alexei Navalny : జైలులో ఉంచిన తనకు రష్యా ప్రభుత్వం కొత్త రకం శిక్ష వేసిందని క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్నీ చెప్పారు. తననుంచిన జైలు చైనీస్ లేబర్ క్యాంప్లాగే...

మాస్కో్ : జైలులో ఉంచిన తనకు రష్యా ప్రభుత్వం కొత్త రకం శిక్ష వేసిందని క్రెమ్లిన్ విమర్శకుడు అలెక్సీ నవాల్నీ (Alexei Navalny) చెప్పారు. తననుంచిన జైలు చైనీస్ లేబర్ క్యాంప్లాగే ఉన్నదన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ఒకరోజు అటుఇటుగా పుతిన్ చాప్టర్ క్లోజ్ అవ్వడం మాత్రం ఖాయమని నవాల్నీ తెలిపారు. రష్యాలో పుతిన్ ప్రభుత్వం అవినీతిపై బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేయడంతో అలెక్సీ నవాల్నీ రాజకీయంగా హీరోగా మారారు. దాంతో ఆయనపై పలు ఆరోపణలు మోపిన ప్రభుత్వం జైలుపాల్జేసింది. మాస్కోకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోక్రోవ్లోని జైలులో నవాల్నీ ఉన్నారు. జైలు నుంచే ‘న్యూయార్క్ టైమ్స్’కు తొలి ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు చెప్పాడు.
ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే.. ప్రభుత్వం అవినీతిపై మాట్లాడుతున్న నన్ను తొక్కిపెడితే చాలన్న విధానంతో ప్రభుత్వం ఉన్నది. అందుకు ఏదో కారణాలు చెప్పి గత ఎనిమిది నెలలుగా పోక్రోవ్లోని జైలులో పెట్టారు. ఇక్కడ కొత్త రకం శిక్షలు వేస్తూ నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. రోజుకు 8 గంటలపాటు స్టేట్ టెలివిజన్ చూడాలని అక్కడి సిబ్బంది నన్ను బలవంతపెట్టారు. పుస్తకాలు చదవడం, ఏదైనా రాయడం ఇక్కడ నిషేధం. ప్రశాంతంగా నిద్రపోవాలను పడుకోగానే నిద్ర లేపుతారు. జైలులో తనకు బ్రెయిన్ వాషింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ జైలు అచ్చు చైనీస్ లేబర్ క్యాంప్ మాదిరిగానే ఉన్నది. ఖైదీలు క్యూలో నిలబెట్టడం, వీడియో కెమెరాలతో కనిపెడుతూ ఉండటం చేస్తుంటారు. ఇవ్వాళ కాకపోతే రేపు.. ఒకరోజు ఆలస్యంగానైనా పుతిన్ పాలన ముగియకపోదు’ అని చెప్పారు. తనపై తోటి ఖైదీలెవరూ ఇంతవరకు ఎలాంటి దాడికి పాల్పడలేదని, వారితో స్నాక్స్ తయారీలో పాల్గొంటూ సరదాగా గడుపుతున్నానని అన్నారు.
మార్చి నెలలో ఈ జైలుకు వచ్చినప్పటి నుంచి అలెక్సీ నవాల్నీ మౌనంగా ఉండటం లేదు. జైలు నుంచే లేఖను విడుదల చేశారు. అనేక సోషల్ మీడియా పోస్టులను కూడా నిర్వహించాడు. అయితే, ఇదే ఆయన తొలి ఇంటర్వ్యూ కావడం విశేషం. కొత్తగా మరికొన్ని నేరాలతో ఆయనపై అభియోగాలు మోపి ఆయన జైలు జీవితాన్ని మరో మూడేండ్లు పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరం రుజువైతే రష్యా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సిన 2024 తర్వాతనే ఆయను విడుదల చేయవచ్చునని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

