సాంకేతిక అంతరాల్లేని అంతర్జాల విద్య రావాలి: వెంకయ్యనాయుడు
అంతర్జాల విద్య, దూరవిద్యలో సమగ్ర విద్యావిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు సూచించారు. సమాజంలో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి, సాంకేతిక వారధులను...

న్యూఢిల్లీ : అంతర్జాల విద్య, దూరవిద్యలో సమగ్ర విద్యావిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు సూచించారు. సమాజంలో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి, సాంకేతిక వారధులను నిర్మించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానమైన విద్యావకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉన్నదని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా అమలుపరచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపన దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక, ప్రాంత అభివృద్ధితోపాటు దేశ ఆర్థికాభివృద్ధిలో ఉన్నతవిద్య కీలకపాత్ర పోషిస్తున్నదని అన్నారు. భారతదేశ విశ్వవిద్యాలయాల ప్రపంచీకరణ జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు కూడా వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని సూచించారు. భారతీయ భాషల్లో ఆన్లైన్ కోర్సుల కొరతను ప్రస్తావిస్తూ, ఎడ్యుటెక్ రంగంలోని ప్రైవేటు సంస్థలు, ప్రాంతీయ భాషల్లో కోర్సుల రూపకల్పనకు నడుం బిగించాలన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా భారతీయ విద్యారంగంలో పరిపూర్ణమైన మార్పులు రానున్నాయని వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పోతన పద్యాన్ని ఉదహరిస్తూ విద్య గొప్పతనాన్ని తెలియజేసిన కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్‌ను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్ఏ కోరితోపాటు అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

