Bomb threat : బర్మింగ్‌హామ్ (Birmingham) నుంచి ఢిల్లీ (Delhi) కి బయిలుదేరిన ఎయిరిండియా (Airindia) విమానానికి బాంబు బెదిరింపు (Bomb threat) కాల్ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్ (Riyadh) కు దారి మళ్లించారు. రియాద్ విమానాశ్రయంలో దిగిన అనంతరం ప్రయాణికులను సేఫ్‌గా బయటికి తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీ చేసి బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
AI-114 నెంబర్ గల ఎయిరిండియా విమానం శనివారం రాత్రి 8.26 గంటలకు బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఆ తర్వాత విమానంలో బాంబు పెట్టినట్లు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ విమానాన్ని అత్యవసరంగా రియాద్‌కు దారి మళ్లించారు. రియాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకెళ్లారు.
విమానంలో బాంబు కోసం భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. కానీ అందులో ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు రియాద్‌లోని ఓ హోటల్లో వసతి ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విమానం రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో ఉంది.