Arrest | ‘పహల్గాం’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు అరెస్ట్
Arrest | పహల్గాం (Pahalgam) లో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల (Terrorists) కు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఇవాళ (ఆదివారం) ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు.
Arrest : పహల్గాం (Pahalgam) లో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల (Terrorists) కు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఇవాళ (ఆదివారం) ఉదయం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు అరెస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి కేసును టేకప్ చేసిన ఎన్ఐఏ ఇప్పటివరకు 2000 మందికి పైగా సాక్షులను విచారించింది. వారిలో పహల్గాంలో గుర్రాలపై పర్యాటకులను రవాణా చేసేవారు కూడా ఉన్నారు.
వేల మంది సాక్షులను విచారించిన ఎన్ఐఏ అధికారులు గత రెండు వారాలుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 32 ప్రాంతాల్లో సోదాలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు. వారిలో ఇద్దరు పహల్గాంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.
కాగా ఈ ఏడాది ఏప్రిల్ 22న నలుగురు ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలను, చిన్నారులను విడిచి పురుష పర్యాటకులను కాల్చిచంపారు. ఒక్కొక్కరిని పేర్లు అడుగుతూ మారణహోమం సృస్టించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, ఒక నేపాలీ ఉన్నారు.
Read More >>
అమెరికా మొదలు పెట్టింది.. మేం అంతం చేస్తాం : ఇరాన్
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దే: డొనాల్డ్ ట్రంప్
మొదట బలప్రయోగం జరిగితే.. ఆ తర్వాత శాంతి అదే ఉద్భవిస్తుంది: ఇజ్రాయెల్ ప్రధాని
బీజాపూర్‌లో మావోయిస్టుల దుశ్చర్య.. మాజీ మావోయిస్టుతోసహా మరొకరి హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

