టెల్ అవీవ్: అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, దాని వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో నెతన్యాహ్యు స్పందించారు. ఈ మేరకు ఆయ ఓ వీడియో విడుదల చ ఏశారు.
‘అధ్యక్షుడు ట్రంప్‌నకు అభినందనలు. మీ అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మీ నిర్ణయం సాహసోపేతమైనది. ఇది చరిత్రను మార్చేస్తుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో ఇజ్రాయెల్ తన శక్తియుక్తులను ప్రదర్శించింది. అయితే, గత రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులు నిజంగా అద్వితీయమైనవి. భూమిపై మరే దేశం చేయలేని రీతిలో దాడులు చేసింది.’ అని నెతన్యాహు అన్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, దాని వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసేందుకు ట్రంప్ వ్యవహరించిన తీరు చరిత్రలో నమోదవుతుందని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. ట్రంప్, నేను తరచూ బలమైన శక్తి ద్వారానే శాంతి స్థాపన జరుగుతుందని చెబుతుంటాం. మొదట బలప్రయోగం జరిగితే, ఆ తర్వాత శాంతి అదే ఉద్భవిస్తుందని వెల్లడించారు. ఇరాన్‌పై దాడుల్లో యూఎస్ చాలా శక్తితో వ్యవహరించిందన్నారు. ఇజ్రాయెల్ ప్రజల తరపున ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేవుడు అమెరికాను, ఇజ్రాయెల్‌ను దీవించాలని ఆకాంక్షించారు.
ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫోర్డో అణు రియాక్టర్ పూర్తిగా ధ్వంసమైందని అంతర్జాతీయ మీడియా వెల్లడింది. కాగా, ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తన గగణతలాన్ని మూసివేసింది. అదేవిధంగా స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. అత్యవసర విభాగాలు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించింది.
#WATCH | “…America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world’s most dangerous regime, the world’s most dangerous weapons…” says Israeli PM Benjamin Netanyahu as amid… pic.twitter.com/k2TgZIFTm8
— ANI (@ANI) June 22, 2025