బుధవారం 20 జనవరి 2021
Hyderabad - Dec 03, 2020 , 08:29:34

సంబురాలకు బ్రేక్

సంబురాలకు బ్రేక్

  • 48 గంటల పాటు విజయోత్సవ ర్యాలీలు నిషేధం
  • స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
  • నిఘా నీడలో బ్యాలెట్‌ బాక్సులు
  • కిలోమీటర్‌ దూరం 144 సెక్షన్‌
  • పరిశీలించిన ట్రై పోలీసు కమిషనరేట్‌ బాసులు
  • ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఓటర్ల తీర్పును భద్రపర్చిన బ్యాలెట్‌ బాక్సులకు పోలీసులు మూడంచెల భద్రతను కల్పించారు. ఈ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద దాదాపు 1 కిలోమీటర్‌ పాటు 144 సెక్షన్‌ విధించారు. ప్రతి కదలికను గుర్తించేందుకు 24/7 పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. సాయుధ గస్తీని మొహరించారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌లు ఈ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును బుధవారం పరిశీలించారు. ఇక కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితిని, ఏర్పాట్లను సమీక్షించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రత వివరాలు..

ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మూడంచెల సెక్యూరిటీ

ఏసీపీ స్థాయి అధికారి ఈ స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 24గంటల పాటు డ్యూటీ నిర్వహిస్తారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్ట్రాంగ్‌ రూమ్‌ల సీల్‌ను వీడియో చిత్రీకరణ చేశారు. 

ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ఔట్‌పోస్టు, కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు.

ఈ పాయింట్‌ల నుంచి దాదాపు 200మీటర్ల వరకు ఎవరూ ఒక చోటుకు చేరొద్దు.

పోలీసు ఎస్కార్ట్‌ ద్వారానే ప్రతి బ్యాలెట్‌ బాక్సు కౌంటింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. 

నగరంలో దాదాపు 48గంటల పాటు విజయోత్సవ ర్యాలీలను నిర్వహించరాదు.

మలక్‌పేట్‌ రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు సహకరించాలి. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన నగర ప్రజలకు పోలీసు బాసులు కృతజ్ఞతలు తెలిపారు.logo