హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) నానాటికీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. పట్టపగలే హత్యలు, దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగేలా రిసెప్షన్ మేనేజ్మెంట్, క్రైమ్ ట్రాకింగ్ తదితర అంశాలను సాంకేతికపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి, ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్ పోలీసులకు తీసుకువచ్చిన ప్రత్యేక గుర్తింపు కాంగ్రెస్ పుణ్యమా అని కనుమరుగైపోతోంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస హత్యలు, దాడులే దీనికి నిదర్శనం. తాజాగా మల్కాజిగిరిలో (Malkajgiri) జరిగిన రియల్టర్ హత్య (Realtor Murder) మరో ఉదాహరణ.
సోమవారం ఉదయం మల్కాజిగిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లాబాంగ్ స్కూల్ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. వెంకటరత్నం అనే రియల్టర్‌ను దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. స్కూటీపై వెళ్తున్న వెంకటరత్నంను వెంబడించిన గుర్తుతెలియని వెక్తులు.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, వెంకటరత్నంపై ధూల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదై ఉన్నట్లు గుర్తించారు. జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఆయనను ప్రత్యర్ధులే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Prajapalana | ప్రజాపాలనలో రక్షణేది!.. పట్టపగలే కాల్పులు, హత్యలు, దోపిడీలు
Traffic Restrictions | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. నేడు, రేపు ట్రాఫిక్ మళ్లింపులు..
IndiGo | కొనసాగుతున్నసంక్షోభం.. హైదరాబాద్‌లో 112 ఇండిగో విమానాలు రద్దు
Krithi Shetty | నా రూమ్‌లో ఆత్మ కనిపించింది.. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి భయానక అనుభవం