హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో (IndiGo) సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ విమానాల రద్దయ్యాయి. సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 112 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్కు రావాల్సిన 58 సర్వీసులు ఉండగా, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 54 విమానాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు విశాఖపట్నం నుంచి 7 విమానాలను ఇండిగో రద్దు చేసింది. వీటిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. అదేవిధంగా అహ్మదాబాద్ నుంచి రాకపోకలు సాగించే 18 విమానాలు రద్దయ్యాయి. కాగా, ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్టు అడ్వైజరీ జారీ జారీచేసింది. ఇవాళ కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని తెలిపింది. ఎయిర్పోర్టుకు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో ఇప్పటివరకు మొత్తం 134 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇందులో రావాల్సినవి 59 ఉండగా, వెళ్లాల్సినవి 75 ఉన్నాయి.