Krithi Shetty | యువ కథానాయిక కృతి శెట్టి ఇటీవల ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెన్నులో వణుకు పుట్టించే అనుభవాన్ని పంచుకున్నారు. సినిమా షూటింగ్‌కు ఒక్క రోజు ముందు హోటల్ రూమ్‌లో తనకూ, తన అమ్మకూ ఆత్మలాంటి ఆకారం కనిపించిందని పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఉప్పెన’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్డమ్ అందుకున్న కృతి శెట్టి, తరువాత వరుస సినిమాల్లో నటించినప్పటికీ పెద్ద విజయాలు అందుకోలేకపోయింది. దీంతో తమిళం, మలయాళం రంగాల్లో అవకాశాలపై దృష్టి పెట్టిన ఆమె ప్రస్తుతం కార్తీ హీరోగా నటించిన వా వాతియర్ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఈ క్రమంలో కృతి మాట్లాడుతూ.. అన్నగారు వస్తారు షూటింగ్‌కు ఒక రోజు ముందు నేను, మా అమ్మ హోటల్లో ఉండగా ఆత్మ లాంటి ఆకారం కనిపించిందని చెప్పింది. వెంటనే లైట్ ఆన్ చేయగానే పెద్ద శబ్దంతో ఆ ఆకారం మాయమైందని చెప్పింది. తుళు సంస్కృతికి చెందినవారమైన తమ ఇంట్లో పూర్వీకులను దైవంలా పూజించే సంప్రదాయం ఉందని, ఇలాంటి అతీత శక్తులపై విశ్వాసం ఎప్పటినుంచో ఉందని పేర్కొన్నారు. ఈ సంఘటనతో తన విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. ‘అన్నగారు వస్తారు’ సినిమాలో కృతిశెట్టి పాత్ర ఆత్మలతో మాట్లాడే పాత్రగా ఉండటం వల్ల ఆమె ఈ అనుభవాన్ని ప్రమోషన్ కోసమే చెప్పిందా? లేక నిజంగానే ఆత్మను చూసిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
త్వరలోనే సినిమా విడుదల కానుండటంతో కృతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.సినిమా ప్రమోషన్ కోసం సృష్టించిన హైపా,లేక నిజంగా అనుభవించిన ఘటననా? అనేది మాత్రం రాబోయే రోజుల్లో తెలియనుంది. కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కృతి శెట్టికి ఈ చిత్రం మంచి విజయం దక్కాలని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.