హైదరాబాద్, అక్టోబర్ 22 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో(Mahatma Jyotiba Phule Praja Bhavan) మంగళవారం నిర్వహించిన ప్రజావాణి( Prajavani) కార్యక్రమంలో మొత్తం 518 దరఖాస్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 130, విద్యుత్ శాఖ కు సంబంధించి 82, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 72, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించి 55, సాంఘిక సంక్షేమం శాఖకు సంబంధించి 29, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 1, ఇతర శాఖలకు సంబంధించి 150 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్‌కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.