వనపర్తి : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయకుండా రైతులను అరిగోస పెడుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తిలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, బాధ్యతగల ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడాలని బీఆర్ఎస్కు శ్రేణులకు పిలుపు నిచ్చారు. వనపర్తిలో(Wanaparthy) ఈ నెల 29న వేలాది మంది రైతులతో భారీ నిరసన(Huge protest) సదస్సు చేపడుతున్నామని, దీనికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.
ఈ రైతు సదస్సులో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు రూ.2500, యువతులకు స్కూటీలు,కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, 4వేల ఆసరా ఫించన్లు, నిరుద్యోగ భృతి, కె.సి.ఆర్ కిట్టు, తదితర హామీలు ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేటట్లు చేయాలని పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వ మోసపూరిత చర్యలపై సమరభేరి మోగిస్తామని సదస్సులో బీఆర్ఎస్ నాయకులు తీర్మానం చేశారు.