PM Modi : బ్రిక్స్ సదస్సు (BRICS summit) లో పాల్గొనేందుకు రష్యాకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సదస్సుకు ముందుగా కజాన్ (Kajan) లో ఈ ఇరుదేశాల అధినేతల భేటీ జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుని, పరస్పర సహకారం అందించుకుంటూ అభివృద్ధి చెందాలని సదస్సులో నిర్ణయించారు.
‘బ్రిక్స్’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఇవాళ (మంగళవారం) ప్రారంభం కానుంది. రష్యాలోని కజాన్ నగరం ఈ సదస్సుకు వేదిక కానుంది. ఈ నెల 24 వరకు సదస్సు కొనసాగనుంది. ‘ప్రపంచ అభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ ఈ ఏడాది సదస్సు ప్రధాన నినాదం. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇతర నేతలు పాల్గొంటారు. బాత్రూమ్లో జారిపడి తలకు గాయమైన కారణంగా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా సదస్సుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు.
కాగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు. ప్రధాని మోదీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇంకా పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
#WATCH | Russia: Prime Minister Narendra Modi meets and holds a bilateral meeting with Russian President Vladimir Putin, in Kazan on the sidelines of the 16th BRICS Summit.
(Source: Host Broadcaster) pic.twitter.com/FARmZH7T0U
— ANI (@ANI) October 22, 2024