David Warner : నవంబర్‌లో భారత జట్టుతో ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ. ఇప్పటికే రెండు పర్యాయాలు స్వదేశంలో ఘోర అవమానం. మూడోసారి కంగారూలను కంగారు పెట్టేందుకు టీమిండియా కాచుకొని ఉంది. ఆరు నూరైనా సరే ఈసారి
తప్పకుండా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే.. ఓపెనర్‌గా ఎవరిని ఆడించాలి? అని సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja)కు జోడీగా ఎవరూ కుదరలేదు. ఈ పరిస్థితుల్లో వరల్డ్ కప్ హీరోగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన డేవిడ్ వార్నర్(David Warner) ఆసీస్ సెలెక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పాడు.
అవసరమైతే చెప్పండి. మళ్లీ దేశం తరఫున ఆడేందుకు సిద్ధమే అంటూ డేవిడ్ బాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘దేశం కోసం అవసరమైతే యూటర్న్ తీసుకునేందుకు రెడీగా ఉన్నానని వార్నర్ అంటున్నాడు. ఆస్ట్రేలియాకు ఆడేందుకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ఓపెనింగ్ సమస్య తీరకుంటే నేనున్నాగా .. మీరు బేఫికర్‌గా ఉండండి. ఒక్క ఫోన్ చేయండి చాలు. వచ్చి డ్రెస్సింగ్ రూమ్‌లో వాలిపోతా’ అని వార్నర్ కోల్డ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ తన మనసులోని మాట చెప్పాడు.
David Warner says he’s available to play against India if the selectors call 😮
(via @BenHorne8) #AUSvIND pic.twitter.com/sGXWJAdZfc
— 7Cricket (@7Cricket) October 22, 2024
Could David Warner return to the Test team?
MORE: https://t.co/8xWa866ihR pic.twitter.com/eSBEKRZ9YG
— Herald Sun Sport (@heraldsunsport) October 22, 2024
టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 నుంచి కూడా తప్పుకున్న వార్నర్ ప్రస్తుతం షఫీల్డ్ ట్రోఫీకి సన్నద్ధమవుతున్నాడు. నిజాయతీగా చెబుతున్నా. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో నా అవసరం ఉంటే పిలవండి. కావాలంటే షీల్డ్ ట్రోఫీలో వచ్చే ఏడాది ఆడుతా. సరైన కారణాలు, సమయంలోనే నేను ఆటకు వీడ్కోలు పలికాను. అయితే.. ఆటను గొప్పగా ముగించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. ఇప్పటికే తాను వచ్చే ఏడాది జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాని ప్రకటించిన విషయం తెలిసిందే.
వార్నర్ వీడ్కోలుతో సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియాకు ఓపెనింగ్ కష్టాలు మొదలయ్యాయి. ఉస్మాన్ ఖవాజాకు సరిజోడీగా నిలిచే ఆటగాళ్లు కరువయ్యారు. స్టీవ్ స్మిత్‌ను ఓపెనర్‌గా పంపినా పరుగులు చేయలేక తంటాలు పడ్డాడు. దాంతో, అతడిని ఇక 4వ స్థానంలోనే ఆడిస్తామని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఇప్పటికే చెప్పాడు.
అందుకని న్యూ సౌత్ వేల్స్ ఓపెనర్ సామ్ కొంతాస్ (Sam Konstas) లేదా విక్టోరియా జట్టు కుర్రాడు మార్కస్ హ్యారిస్ (Marcus Harris)లలో ఒకరిని ఓపెనర్‌గా తీసుకోవాలిన ఆసీస్ సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ ఏడాది భారత్, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 22న తొలి మ్యాచ్‌తో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ షురూ కానుంది.
సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు.. వరల్డ్ కప్ ట్రోఫీతో వన్డేలకు వీడ్కోలు పలికేసిన డేవిడ్ భాయ్.. టీ20 వరల్డ్ కప్‌తో అన్ని ఫార్మట్ల నుంచి వైదొలిగాడు. తన సుదీర్ఘ కెరీర్లో వార్నర్ పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ చరిత్ర సృష్టించాడు.
David Warner walks out for his last test match at sidney
Guard of honour from Pakistan for David Warner. Respect ♥️ #AUSvPAK pic.twitter.com/gbi036HuUB— Muhammad Raees (@MuhammadRa46602) January 3, 2024
ఈ క్రమంలో అతడు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు బద్దలు కొట్టాడు. ప్రస్తుతానికి వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. వార్నర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.