Redmi A4 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)-2024లో ఈనెల 16న ఆవిష్కరించింది. స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 చిప్ సెట్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. రూ.10 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది.
రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499 పలుకుతుందని సమాచారం. బ్యాంకు డిస్కౌంట్, ఇతర డిస్కౌంట్లతో కలిపిన తర్వాతే ఈ ధర పలుకుతుందని చెబుతున్నారు. క్వాల్ కామ్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తుందని భావిస్తున్నారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉంటుందని, 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని తెలుస్తున్నది.
రెడ్మీ ఏ4 5జీ (Redmi A4 5G) ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ 1.0 స్కిన్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇంతకుముందు భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన రెడ్మీ ఏ4 4జీ (Redmi A3 4G) ఫోన్ 3 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,299లకే లభించింది.