బంజారాహిల్స్,ఫిబ్రవరి 2: అమెరికాలో(America) ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం(Cheated ) చేసిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సయ్యద్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఎండీ.అజారుద్దీన్ అనే యువకుడికి టోలీచౌకికి చెందిన అజీజ్ అనే వ్యక్తి జాఫర్ ఖాన్ రిజ్వీ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. తాను అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చానని, తనకు అనేకమందితో పరిచయాలు ఉన్నాయని రిజ్వీతో పాటు అతడి భార్య అజ్రా ఫాతిమాను నమ్మబలికాడు. అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించడంతో పాటు రెండు దఫాలుగా రూ.1.10 లక్షలు ఇచ్చాడు.
టెక్సాస్‌లోని ఓ హోటల్లో ఉద్యోగం ఖరారు అయిందని త్వరలోనే వీసా వస్తుందని గత కొన్ని నెలల నుంచి సాగదీస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో ముఖం చాటేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు అజారుద్దీన్ ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 318(2), 318(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వం హత్యే : హరీశ్‌రావు
Komuravelli | మూడో వారం అదే జోరు.. మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డికి.. ఆ రోగుల లక్షణాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత