RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మానసిక స్థితి మీద నాకు సీరియస్ డౌట్స్ ఉన్నాయి.. నాకే కాదు, యావత్తు తెలంగాణకు అనుమానాలు ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఆయన ఆలోచనలు, మాటలు, చేతలు చూస్తుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్(APD), బార్డర్‌లైన్ పర్సనాలిటీ డిసార్డర్ (BPD) లేదా బైపోలార్ డిసార్డర్ రోగి లక్షణాలుగా కనిపిస్తున్నాయని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. సీఎం బాధ్యతలు ఎవరికైనా తాత్కాలికంగా అప్పజెప్పి వారిని ఎర్రగడ్డలో ఉన్న మెంటల్ హాస్పిటల్ లేదా ఆశా హాస్పిటల్ లేదా చేతన హాస్పిటల్లో ఉన్న క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌కు చూపిస్తే బాగుంటుందేమో ఆలోచించాలని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మానసిక స్థితి మీద నాకు సీరియస్ డౌట్స్ ఉన్నయి. నాకే కాదు, యావత్తు తెలంగాణ కు అనుమానాలు ఉన్నాయి.
ఆయన ఆలోచనలు, మాటలు, చేతలు Anti-Social Personality Disorder(APD), Borderline Personality Disorder(BPD) లేదా Bipolar Disorder రోగి లక్షణాలు గా… https://t.co/01XHXvn1HP
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) February 2, 2025
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Arvind Kejriwal | మళ్లీ మాదే విజయం.. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం : కేజ్రీవాల్