Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో మళ్లీ విజయం తమదేనని ఆప్ కన్వీనర్ (AAP convenor) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఆప్ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తుండగా.. బీజేపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో బీజేపీ నేతలు ఢిల్లీలో గూండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలపై దాడులు చేస్తున్న బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని కేజ్రీవాల్ విమర్శించారు.
ఢిల్లీలో ఈ విధమైన ఎన్నికలను ప్రజలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ గూండాయిజానికి వ్యతిరేకంగా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గూండాయిజాన్ని దేశం దృష్టికి తెచ్చేందుకు ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ లేదా అధికార యంత్రాంగం దాడులు చేసినా, వేధింపులకు గురిచేసినా ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు.
మీకు జరగకపోయినా ఏదైనా ఘటన మీ దృష్టికి వస్తే ‘అమిత్ షా గుండాగిరి హ్యాష్‌ట్యాగ్’ను వాడి తమకు సమాచారం ఇవ్వాలని కేజ్రీవాల్ సూచించారు. పోలీసులు మీతో తప్పుగా వ్యవహరించినా, అధికారులు లేదా బీజేపీ నేతలు మిమ్మల్ని వేధింపులకు గురిచేసినా హ్యాష్‌ట్యాగ్ ద్వారా తెలియజేయాలన్నారు. అమిత్‌షా ఢిల్లీ ప్రజలపై ఏ విధంగా గూండాగిరి చేస్తున్నరో దేశం మొత్తం చూస్తున్నదని వ్యాఖ్యానించారు. బీజేపీ మనలను భయపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం బెదరవద్దని సూచించారు.
అంతేగాక, ఢిల్లీ ఎన్నికలకు ముందు మురికివాడల్లో నివసించే, ఆర్థికంగా బలహీనులైన వర్గాల వారి ఓటు హక్కును తొలగించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అంతేకాదు సర్వెంట్ క్వార్టర్స్, ధోబీ ఘాట్లు, మురికివాడల్లో నివసించేవారి నుంచి తనకు చాలా కాల్స్ వస్తున్నాయని, ఓటర్లకు రూ.3000 చొప్పున ఇస్తున్నారని ఆయన అన్నారు.
Student gave birth | కాలేజీ టాయిలెట్లో విద్యార్థిని ప్రసవం.. ఆ తర్వాత..!
Tariffs War | దేశాల మధ్య సుంకాల యుద్ధం.. అమెరికా యాక్షన్.. కెనడా, మెక్సికో రియాక్షన్
Road accident | అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం
Valentines Day | ప్రేమంటే ఏంటి.. ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది?