Road accident | అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం
Road accident | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) డాంగ్ జిల్లా (Dong district) లోని సపుతర హిల్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5.30 గంటలకు బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లింది.
Road accident : ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు (Private Bus) అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గుజరాత్ రాష్ట్రం (Gujarat state) డాంగ్ జిల్లా (Dong district) లోని సపుతర హిల్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5.30 గంటలకు బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లింది.
బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే బస్సు అదుపుతప్పి లోయలో పడిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్ సహా ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం జరగగానే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యాత్రికులు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకకు వస్తుండంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
బాధితులంతా మధ్యప్రదేశ్‌లోని గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాలకు చెందినవారని డాంగ్ జిల్లా కలెక్టర్ మహేశ్ పటేల్ తెలిపారు. వారంతా 2025 డిసెంబర్ 23న మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు 4 వేర్వేరు బస్సుల్లో బయలుదేరారని చెప్పారు. వాటిలో ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిందని, బ్రేక్ ఫెయిల్యూర్ వల్లనే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

