Student gave birth : ఓ కాలేజీ విద్యార్థిని (College Student) వివాహం కాకుండానే గర్భం దాల్చింది. నెలల నిండే వరకు విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. చివరికి గత శుక్రవారం పురటినొప్పులు రావడంతో కాలేజీ టాయిలెట్ (College toilet) లోకి వెళ్లి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం బిడ్డను చెత్తకుండీలో పడేసి వచ్చి క్లాస్‌రూమ్‌లో కూర్చుంది. తమిళనాడు రాష్ట్రం (Tamil Nadu state) లోని తంజావూరు జిల్లా (Tanjavuru district) లో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అయితే రక్తస్రావం ఎక్కువై ఆమె క్లాస్‌రూమ్‌లో పడిపోవడంతో విషయం బయటికి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఓ ప్రభుత్వ మహిళా కాలేజీలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని వివాహం కాకుండానే గర్భం దాల్చింది. విషయం తెలిస్తే సమాజం నిందిస్తుందనే భయంతో నెలలు నిండే వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. గత శుక్రవారం క్లాస్‌రూమ్‌లో ఉన్న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో టాయిలెట్లోకి వెళ్లింది. అక్కడ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యూట్యూబ్‌లో చూసి తనే బొడ్డు తాడును కత్తిరించుకుంది. అనంతరం శిశువును తీసుకెళ్లి కాలేజీ ఆవరణలోని చెత్తకుండీలో పడేసింది.
ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా వచ్చి క్లాస్‌రూమ్‌లో కూర్చుంది. కానీ రక్తస్రావం తీవ్రం కావడంతో కళ్లు తిరిగి పడిపోయింది. ఇది గమనించిన కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమెకు ప్రసవం జరగిందని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఆపై వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిశువును ఏం చేశావని విద్యార్థినిని వైద్యులు ప్రశ్నించడంతో కాలేజీ ఆవరణలోని చెత్తకుండీలో వేసినట్లు చెప్పింది.
వెంటనే కాలేజీలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేయగా చెత్తకుండీలో పడివున్న శిశువును తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తల్లీబిడ్డ ఇద్దరికీ వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పారు. కాగా ఈ అమానవీయ ఘటనపై నాచ్చియార్ కోయిల్ స్టేషన్ మహిళా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు విద్యార్థినికి ఇప్పుడు 20 ఏళ్లు ఉన్నాయని, ఆమె తన సమీప బంధువుతో ప్రేమలో పడిందని, ఫలితంగానే ఆమె గర్భంగా దాల్చిందని పోలీసులు తెలిపారు.
సమాజం నిందిస్తుందనే భయంతో గర్భం విషయం ఎవరికీ తెలియకుండా ఇద్దరూ జాగ్రత్తపడ్డారని పోలీసులు చెప్పారు. బాధితురాలు గర్భం దాల్చడానికి కారణమైన యువకుడు కూడా మేజరే అని, అతడు విద్యార్థినితో తనకు ఉన్న సంబంధం నిజమేనని ఒప్పుకున్నాడని తెలిపారు. ఆమెను వివాహం చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అతడు చెప్పినట్లు వెల్లడించారు. ఇద్దరూ మేజర్లు కావడంవల్ల వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని అన్నారు.
Tariffs War | దేశాల మధ్య సుంకాల యుద్ధం.. అమెరికా యాక్షన్.. కెనడా, మెక్సికో రియాక్షన్
Road accident | అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం
Valentines Day | ప్రేమంటే ఏంటి.. ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది?
Fassion | నయా ఫ్యాషన్.. ముద్దుగుమ్మల పాదాలను అందంగా అలంకరిస్తున్న కడియాలు