MLC Kavitha | హైదరాబాద్ : జనగణనపై కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. సమ్మిళిత అభివృద్ధికి జనగణన తప్పనిసరిగా అవసరమని కవిత అన్నారు.
జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని కవిత మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుంది..? అని ప్రశ్నించారు. జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుంది..? అని అడిగారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి ఆమె పేర్కొన్నారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
From ₹8,754 Cr proposed in 2019 to just ₹574 Cr now – the delay in the Census is a delay in India’s growth. The roadmap to progress cannot be built on mere idealistic statements but requires solid data and surveys that define the true picture of India. Data drives progress.
No…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 2, 2025
ఇవి కూడా చదవండి..
KTR | అన్నపూర్ణ తెలంగాణను.. ఏడాదిలో ఆత్మహత్యల తెలంగాణగా చేశారు: కేటీఆర్
Congress | టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి.. ముప్పేట ముట్టడిలో చిక్కిన అధికార పార్టీ