బూర్గంపాడు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో కస్తూర్బా హాస్టల్ విద్యార్థిని అదృశ్యమయింది. బూర్గంపాడులోని జూనియర్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని.. శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బంధువుల పేరుతో బయటికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయినా ఆమె తిరిగి రాకపోవడంతో సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బూర్గంపాడుకు చేరుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.