Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వం హత్య అని పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన భార్య చెబుతుంది ఏ బ్యాంక్‌కు వెళ్లినా నువ్వు బిల్డర్ అప్పు ఇవ్వమని చెప్పారట. ఒకప్పుడు బిల్డర్ వెనుకాల పడి అప్పులు ఇచ్చే బ్యాంకులు.. 14 నెలల కాంగ్రెస్ పాలన పుణ్యమా అని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. భార్య పేరు మీద లోన్ అప్లై చేసి.. కో అప్లికేంట్గా వేణుగోపాల్ రెడ్డి ఉంటే.. నువ్వు బిల్డర్ కాబట్టి అప్పు ఇవ్వమని బ్యాంకర్లు అన్నారట అని హరీశ్‌రావు తెలిపారు.
ఈ 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక అపార్ట్మెంట్ కూడా అమ్ముడు పోక, బ్యాంకులకు పోతే అప్పు రాక, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా యువ బిల్డర్. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు.. 39 ఏండ్ల వేణుగోపాల్ రెడ్డికి ఐదేండ్ల పాప ఉంది. రాత్రంతా నాన్న.. నాన్న అని పాప ఏడుస్తూ ఉందని తల్లి రోదిస్తుంటే హృదయం ద్రవీంచిపోయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలి.. మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.. చివరకు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Komuravelli | మూడో వారం అదే జోరు.. మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డికి.. ఆ రోగుల లక్షణాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత