Weight Loss | బరువు తగ్గేందుకు ఎంతో శ్రమ పడతాం. ఎన్నో కఠిన నియమాలు పాటిస్తాం. అయినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. నిద్రకు ముందు ఈ పానీయాలు తాగితే ఊబకాయం నియంత్రణలోకి వస్తుందని చెబుతారు..
పాలు, పాల ఉత్పత్తులతో మధ్య వయస్కులు, వృద్ధులు బరువు తగ్గే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పాలలోని మాంసకృత్తులు ఆకలితో పోరాడే హార్మోన్లను సమన్వయ పరుస్తాయి.
సోయాపాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. పడుకునే ముందు సోయాపాలు తాగితే ఆరోగ్యకరమైన జీవక్రియ సాధ్యం అవుతుంది. స్థూలకాయం ఉన్నవారు రోజూ ఒక పూటైనా సోయాపాలు తాగాలని సూచిస్తారు నిపుణులు.
పడుకునే సమయంలో గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని తాగడం వల్ల మలబద్ధకం పోతుంది. జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క, తేనె వేసుకొని తాగితే జీవక్రియ మెరుగుపడుతుంది. ఒంట్లో కొవ్వు పేరుకుపోదు. పేగులలోని హానికర బ్యాక్టీరియా నాశనం అవుతుంది. ఇవన్నీ ఊబకాయాన్ని నివారించే అంశాలే.
బరువు తగ్గడానికి సాయపడే పానీయాల్లో నిమ్మరసం ముఖ్యమైంది. నిద్రకు ముందు నిమ్మరసం, వేడినీళ్లు కలుపుకొని తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో కూడా ఈ పానీయం తోడ్పడుతుంది. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి వచ్చేస్తాయి.
అల్లం, నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పడుకునేముందు అల్లం, నిమ్మరసం తీసుకుంటే జీవక్రియ చురుగ్గా సాగుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు.
“మీ శరీరంనుంచి చెమటకంపు కొడుతోందా? అయితే, మంచిదేనట!!”
“Health Tips | బరువు తగ్గాలంటే వీటిని పాటించండిలా..!”