బెల్లీఫ్యాట్ ఉంటే మనుషులు అసహ్యంగా కనిపిస్తారు. అందుకే చాలామంది వెంటనే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకొని ఆకర్షణీయంగా కనిపించాలని చూస్తారు. అలాగే, అధిక బరువు అనేది మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియ రుగ్మతలకు కారణమవుతుంది. వైద్యులు కూడా బాడీ వెయిట్ కంట్రోల్లో ఉండాలని సూచిస్తుంటారు. ఇందుకోసం చాలామంది ఆహారంలో మార్పు చేసుకుంటారు. వివిధ వర్కౌట్స్ చేస్తుంటారు. అయితే, నడకవల్ల త్వరగా బరువు తగ్గుతారనే విషయం చాలామందికి తెలియదు. కొన్ని కార్డియో ట్రిక్స్ తెలుసుకుని ప్రతిరోజూ ఇలా నడిస్తే ఈజీగా అధిక బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నడక.. బరువు తగ్గడంలో సహాయపడుతుందా?
నడక..బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో తక్కువ సహాయపడుతుందని అంతా భావిస్తారు. సాధారణ నడక అధిక బరువును తగ్గించడంలో అత్యంత ప్రభావం చూపదని, అయితే, కొన్నిరకాల కార్డియో ట్రిక్స్ పాటిస్తూ నడిస్తే మంచి ఫలితం ఉంటుంది నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ట్రిక్స్‌ను వారు సూచించారు.
1.ఎత్తుపైకి నడవండి:
ఎత్తుపైకి నడవడం వల్ల వ్యాయామం తీవ్రత పెరుగుతుంది. దీనికి ఎక్కువ శ్రమ అవసరం. తుంటి, కాళ్ల చుట్టూ కండరాలు గట్టిపడుతాయి. ఎక్కువ సంఖ్యలో కేలరీలు ఖర్చవుతాయి. ఎత్తైన ప్రదేశాలకు కాలినడకన చేరుకోవాలి. శిఖరాగ్రం వరకు చేరుకోవాలి. ఆ తర్వాత కిందికి నడిచి మళ్లీ, పైకి ఎక్కాలి. ఇది కండరాలు కొంచెం విశ్రాంతి తీసుకునేందుకు, మరొక రౌండ్ వ్యాయామానికి సిద్దమయ్యేందుకు సహాయపడుతుంది.
2. నడక వేగాన్ని పెంచాలి..
ఎక్కువసేపు ఒకే వేగంతో నడవడం వల్ల ఒకేసారి ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా, కొన్ని నిమిషాలపాటువేగంతో నడిచి, ఆపై వేగాన్ని తగ్గించాలి. ఇది స్టామినా ఓవర్టైమ్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
3.వాకింగ్ లంగెస్ చేయాలి..
వర్కౌట్ల సమయంలో ప్రతిసారీ కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ఆ ప్రక్రియలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. వాకింగ్ లంగెస్ అనేది ఒక తీవ్రమైన వ్యాయామం. ఇందులో సుదీర్ఘంగా ముందుకు సాగుతూ, మోకాలిని నేలకు సున్నితంగా తాకించాల్సి ఉంటుంది. ఒక్కో కాలుతో 10 నుంచి 15 సార్లు లంగెస్ చేయాలి. ఇలా తక్కువ వ్యవధిలో ఎక్కువ కేలరీలు ఖర్చు చేయొచ్చు. రెండు చేతుల్లో డంబెల్స్ పట్టుకుని చేస్తే ఇంకా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి.