మీ శరీరంనుంచి చెమటకంపు కొడుతోందా? అయితే, మంచిదేనట!!
చాలామందికి తరుచూ చెమటలు పడుతుంటాయి. చెమటలతో బట్టలు తడిచిపోతుంటాయి. వారిదగ్గరనుంచి చెమట వాసన వస్తుంటుంది. స్టైల్‌గా డ్రెస్ వేసుకొని ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినప్పుడు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు, ఇతరత్రా పనులపై బయటకు వెళ్లినప్పుడు ఎక్కువగా చెమటలు పట్టడం ఇబ్బందికరంగా ఉం
న్యూఢిల్లీ: చాలామందికి తరుచూ చెమటలు పడుతుంటాయి. చెమటలతో బట్టలు తడిచిపోతుంటాయి. వారిదగ్గరనుంచి చెమట వాసన వస్తుంటుంది. స్టైల్‌గా డ్రెస్ వేసుకొని ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినప్పుడు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు, ఇతరత్రా పనులపై బయటకు వెళ్లినప్పుడు ఎక్కువగా చెమటలు పట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది. చెమటల వల్ల శరీరంనుంచి దుర్వాసన వస్తుంది. అయితే, దీని గురించి ఇక చింతించాల్సిన పనిలేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెమట పట్టడం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారంటున్నారు.
శరీరం వేడెక్కదు..
చెమటలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. ఫలితంగా శరీరంగా వేడెక్కదు. దీర్ఘకాలంలో ఇది అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం..
చెమట అనేది బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పనిచేసే సహజ కవచం. స్వేద రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. అదనపు ధూళి, ఆయిల్‌ను బయటకు పంపుతుంది. అదనంగా ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పోషకాలు, ఆక్సిజన్‌తో చర్మ కణాలకు పోషణను అందిస్తుంది.
బరువు తగ్గొచ్చు..
చెమట పట్టడం వల్ల బరువు తగ్గడం వేగవంతమవుతుంది. వ్యాయామం చేసే సమయంలో ఎక్కువ చెమట పడితే వర్కౌట్ సెషన్ మరింత తీవ్రంగా చేస్తున్నట్లు అర్థం. ఇది ఆరోగ్యకరమైన గుండెకు సూచన అని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువ..
స్వేద గ్రంథులు చర్మం ఉపరితలంపై నీటిని విడుదల చేస్తాయి. అంటే మూత్రపిండాలు, మూత్ర నాళాల్లో కిడ్నీ స్టోన్ పదార్థం పేరుకుపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇంకా, ఈ ప్రక్రియలో ఎక్కువ నీరు తాగడం వల్ల టాక్సిన్స్ చేరే ప్రమాదం తగ్గుతుంది.
శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది..
స్వేద గ్రంథులు చర్మంలోని టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయడంలో సహాయపడతాయి, తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 2016 అధ్యయనం ప్రకారం..ఫిట్నెస్ ఔత్సాహికులు శరీరంలో సీసం లేదా పాదరసం లాంటి భారీ లోహాల స్థాయిలను కలిగి ఉంటారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

