N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
N95 Mask వాడటం వరకు బాగానే ఉంది. దాన్ని ఎలా శుభ్రం చేయాలి? N95 మాస్క్‌ను ఉతకవచ్చా? అసలు N95 మాస్క్‌ను ఉతక్కుండా ఎన్ని రోజులు వాడొచ్చు?

ఈ కరోనా టైంలో మాస్క్ మస్ట్ ! డబుల్ మాస్క్ అయితే బెస్ట్ !! అదే N95 ఇంకా బెస్ట్ !! కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చాలామంది నోట వినిపిస్తున్న మాటలు ఇవే. N95 మాస్క్ ( N95 Mask ) వాడటం వరకు బాగానే ఉంది. దాన్ని ఎలా శుభ్రం చేయాలి? సర్జికల్ మాస్క్ అయితే ధర తక్కువ కాబట్టి ఒక రోజు వాడి పారేస్తాం. బట్ట మాస్క్ అయితే ఒక్క రోజు వాడగానే శుభ్రంగా ఉతికి ఆరేస్తాం. అలా N95 మాస్క్‌ను ఉతకవచ్చా? అసలు N95 మాస్క్‌ను ఉతక్కుండా ఎన్ని రోజులు వాడొచ్చు?

N95 Mask ఉతకవచ్చా?
ఎన్ 95 మాస్కులు కరోనా వైరస్‌ను 95 శాతం వరకు సమర్థంగా అడ్డుకుంటాయి. కాకపోతే సర్జికల్, బట్ట మాస్కులతో పోలిస్తే వీటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా అని వీటిని ఉతికి వాడుకోవడం చేయొద్దు. వీటిని ఉతకడం వల్ల వడపోత సామర్థ్యం దెబ్బతింటుంది. అప్పుడు ఈ మాస్కులను ఉపయోగించిన ప్రయోజనం ఉండదు. N95 మాస్క్‌లను కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో మాత్రమే శుభ్రం చేస్తారు.

N95 మాస్కులు ఎవరు వాడాలి?
డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, అలాగే కరోనా బారిన పడిన వారిని చూసుకునే వారు కూడా ఈ ఈ N95 మాస్కులను తప్పనిసరిగా వాడాలి. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా వీటిని ధరించాలి. మిగిలిన వారు మూడు పొరలతో కూడిన సర్జికల్ మాస్కులు ధరిస్తే చాలు.

ఒక్క N95 మాస్క్ ఎన్నిసార్లు వాడొచ్చు?
సాధారణంగా ఎన్ 95 మాస్కులను ప్రతి 8 గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక మాస్కును ఎక్కువ సార్లు వాడాలని అనుకుంటే.. తొలి రోజు ఒక మాస్క్ వాడిన తర్వాత దాన్ని ఒక కవర్లో భద్రపరచుకోవాలి. రెండో రోజు ఇంకో మాస్క్ వాడి దాన్ని వేరే కవర్లో భద్రపరచుకోవాలి. ఇలా నాలుగు మాస్కులను నాలుగు రోజులు వాడాలి. ఆ తర్వాత ఐదో రోజు మొదటి రోజు వాడిన మాస్క్‌ను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మాస్క్ మీద వైరస్‌తో కూడిన తుంపర్లు ఏవైనా చేరి ఉంటే ఆ నాలుగు రోజుల్లో ఎండిపోతాయి. ఇలా ఒక్కో మాస్క్‌ను నాలుగు నుంచి ఐదు సార్లు వాడుకోవచ్చు.

ఎన్-95 మాస్కుల్లో ఎలాంటివి వాడాలి
రెస్పిరేటరీ వాల్వ్ లేని ఎన్ 95 మాస్కులను మాత్రమే వాడాలి. రెస్పిరేటరీ వాల్వ్‌లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అదే మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపిచేస్తుంది. ఒకవేళ కరోనా సోకిన వారు రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కులు ధరిస్తే వారు వదిలిన గాలి నేరుగా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?
COVID-19 doubts : ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా?
COVID Vaccine : వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? గుండెజబ్బులు, షుగర్ ఉంటే టీకా తీసుకోవచ్చా?
Coronavirus Recovery : కరోనా తగ్గినా వ్యాయామం చేయాల్సిందే
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID-19 doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
Coronavirus Recoveryబోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

